- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వారివల్లే వలసలు.. బైడన్‌పై ట్రంప్ ఫైర్
అమెరికా మాజీ అధ్యక్షుడు జోబైడన్ పై ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ ఫైర్ అయ్యారు. ట్రంప్‌తో పాటూ మరికొందరిని టార్గెట్ చేస్తూ

దిశ, వెబ్ డెస్క్: అమెరికా మాజీ అధ్యక్షుడు జోబైడన్ పై ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ ఫైర్ అయ్యారు. ట్రంప్‌తో పాటూ మరికొందరిని టార్గెట్ చేస్తూ ఎక్స్ వేధికగా ట్రంప్ విరుచుకుపడ్డారు. ఓ వైపు ఈస్టర్ శుభాకాంక్షలు చెబుతూనే మరోవైపు ఇండైరెక్ట్‌గా మండిపడ్డారు. హంతకులు, మాదకద్రవ్యాల వ్యాపారం చేసేవారు. ప్రమాదకర నేరస్థులు, గ్యాంగులను దేశంలోకి తీసుకువచ్చేందుకు పోరాడుతన్న, కుట్రపన్నుతున్నవారందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు అని పేర్కొన్నారు.
ఇలాంటి వ్యక్తులు మనదేశంపై దాడులకు పాల్పడటానికి అనుమతిస్తున్న అసమర్థన్యాయమూర్తులు మరియు దర్యాప్తు అధికారులకు కూడా శుభాకాంక్షలు అంటూ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓపెన్ బార్డర్స్ పాలసీ ద్వారా సరిగ్గా తనిఖీలు చేయకపోవడం వల్లనే లక్షలాది మంది వలసదారులు వచ్చారని ఆరోపించారు. ఇప్పటివరకు పనిచేసిన వారిలో అత్యంత అసమర్ధుడు బైడెన్ అంటూ మండిపడ్డారు. గతంలో ఆయన ఏం చేశారో ఆయనకే తెలియదని, ఎన్నికల సమయంలో తనను మోసం చేసిన అందరికీ థాంక్స్ అని చెప్పారు.






