- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
USA: న్యూయార్క్‌లో తెలంగాణ జానపద పండగ.. ఆటపాటలతో ఉర్రూతలూగించిన సింగర్స్
అగ్రరాజ్యం అమెరికా(America)లో మరోసారి తెలంగాణ పల్లె జానపదం(Telangana Folk Festival) మెరిసింది.

దిశ, వెబ్‌డెస్క్: అగ్రరాజ్యం అమెరికా(America)లో మరోసారి తెలంగాణ పల్లె జానపదం(Telangana Folk Festival) మెరిసింది. నైటా(న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం) దసరా వేడుకల సందర్భంగా న్యూయార్క్‌లో మన సంస్కృతీ, సంప్రదాయాలు, పండగల థీమ్‌తో కార్యక్రమాలు ఈ వీకెండ్‌లో నిర్వహించారు. పెద్ద సంఖ్యలో హాజరైన తెలుగు కుటుంబాలు ఈ ఉత్సవాలను ఆద్యంతం ఎంజాయ్ చేశారు. ‘ధూమ్ ధామ్’ వ్యవస్థాపకులు రసమయి బాలకిషన్‌తో పాటు రేలా రే రేలా గంగ, లావణ్య, దండేపల్లి శ్రీనివాస్‌లు తెలంగాణ ఫోక్ సాంగ్స్, ఆటపాటలతో కార్యక్రమాన్ని ఉర్రూతలూగించారు. వీరితో పాటు అమెరికాలో స్థిరపడిన తెలుగు టాలెంట్ అమ్మాయిలు, అబ్బాయిలు తమ కల్చరల్ ప్రోగ్రామ్స్‌తో ఆకట్టుకున్నారు. లౌకికా రెడ్డి, కావ్యా చౌదరి, ఐశ్వర్యల ప్రత్యేక ప్రదర్శనలతో అలరించారు.
న్యూయార్క్ కాంగ్రెస్ మెన్, హౌజ్ ఆఫ్ రిప్రజెంటెటివ్స్ మెంబర్ టామ్ సూజి ఈ ఫెస్ట్‌కు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. తెలంగాణ వేడుకలు అద్భుతంగా ఉన్నాయని మెచ్చుకున్నారు. పెద్ద సంఖ్యలో స్థిరపడిన తెలుగువారు అమెరికా అభివృద్దిలో అంతర్భాగమయ్యారని సూజి అన్నారు. అమెరికాలో స్థిరపడినా సొంతప్రాంత పండగల సంప్రదాయాలను కొనసాగిస్తూ, కొత్త తరాలకు పరిచయం చేయటం కోసమే దసరా వేడుకలను నిర్వహించామని, విజయవంతం చేసిన ప్రతీ ఒక్కరికీ నైటా ప్రెసిడెంట్ వాణి ఏనుగు ధన్యవాదాలు తెలిపారు. ఎన్ఆర్ఐ ప్రముఖులు పైళ్ల మళ్లారెడ్డితో పాటు న్యూయార్క్, న్యూజెర్సీ పరిసరాల్లో స్థిరపడిన తెలుగు కుటుంబాలు ఈ వేడుకలకు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. శ్రీలక్ష్మి కులకర్ణి వ్యాఖ్యాతగా వ్యవహరించగా, నైటా ఎగ్జిక్యూటివ్ కమిటీ, బోర్డు ఆఫ్ డైరెక్టర్స్, అడ్వయిజరీ కమిటీ సభ్యులు పూర్తి సమన్వయంతో వేడుకలను విజయవంతం చేశారు.






