Dallas : డాలస్‌లో ఎగిరిన భారతీయ జాతీయ పతాకం.. కదం తొక్కిన ఎన్ఆర్ఐలు

by Bhoopathi Nagaiah |

అమెరికా (America)దేశంలో డాలస్ (Dallas) అతి పెద్దదైన మహాత్మాగాంధీ స్మారకస్థలి(Mahatma Gandhi Memorial) వద్ద భారతదేశ 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.

Dallas : డాలస్‌లో ఎగిరిన భారతీయ జాతీయ పతాకం.. కదం తొక్కిన ఎన్ఆర్ఐలు
X

దిశ, వెబ్‌డెస్క్ : అమెరికా (America)దేశంలో డాలస్ (Dallas) అతి పెద్దదైన మహాత్మాగాంధీ స్మారకస్థలి(Mahatma Gandhi Memorial) వద్ద భారతదేశ 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జనవరి 26వ తేదీన వందలాదిమంది ప్రవాసభారతీయుల(NRI) ఆనందోత్సాహాల మధ్య ఈ సంబురాలను నిర్వహించారు.

ఈ సందర్భంగా మహాత్మాగాంధీ మెమోరియల్ (Mahatma Gandhi Memorial) వ్యవస్థాపక అధ్యక్షుడు డా. ప్రసాద్ తోటకూర (Dr.Prasad Thotakura) జాతీయ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. “చలి తీవ్రంగా ఉన్నప్పటికీ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్న ప్రవాస భారతీయలకు కృతజ్ఞతలు అన్నారు. అవతారిక, 395 ఆర్టికల్స్, 8 షెడ్యూల్, 22 భాగాలు, మొత్తం 251 పేజీల ఉన్న రాజ్యాంగం భారతదేశ పరిపాలనకు సంబంధించిన ప్రామాణిక గ్రంథం అన్నారు. దీనిలో ప్రభుత్వ నిర్మాణం, అధికారాలు, విధులు, ప్రభుత్వసంస్థల విధులు, పౌర హక్కులు వివరంగా పేర్కొనబడి ఉన్నాయని గుర్తు చేశారు.

1950లో జనవరి 26న అమలులోకి వచ్చిన ఈ రాజ్యంగ రచన వెనుక రాజ్యాంగ ముసాయిదాను రూపొందించిన బ్రిటిష్ ప్రభుత్వంలో ఇండియన్ సివిల్ సర్వెంట్‌గా పనిచేసిన సర్‌ బెనెగళ్ నర్సింగరావు (బి.ఎన్ రావు) కృషి, ముసాయిదా కమిటీకు చైర్మన్ గా విశేష సేవలందించిన బీ.ఆర్ అంబేడ్కర్ (Dr.BR Ambedkar) మరియు వారి కమిటీ సభ్యులు అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, ఎన్. గోపాలస్వామి, కే.ఎం మున్షి, మహ్మద్ సాదుల్లా, బీ.ఎల్ మిట్టర్, డీ.పీ ఖైతాన్ లు అభినందనీయులు అని కొనియాడారు.

ప్రధాని నెహ్రు అభ్యర్ధన మేరకు ప్రముఖ చేతిరాత నిపుణుడు ‘ప్రేమ్ బిహారీ నారాయణ్ రైజాదా’ తన సొంత దస్తూరితో ఆరునెలల పాటు శ్రమించి హిందీ, ఆంగ్ల భాషలలో రాసిన మన భారత రాజ్యాంగం ప్రపంచంలో కెల్లా అతిపెద్ద లిఖిత రాజ్యాంగం అని, దీని అసలు ప్రతిని ఇప్పటికీ పార్లమెంట్ గ్రంథాలయంలో అందరూ చూడవచ్చు అని డా. ప్రసాద్ తోటకూర అన్నారు.”

ఎంతో కోలాహలంగా మాతృదేశభక్తి స్ఫూర్తితో జరిగిన ఈ వేడుకలకు మహాత్మాగాంధీ మెమోరియల్ కార్యదర్శి రావు కల్వాల హాజరైన వారందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసి స్వాగతం పలికారు. మహాత్మాగాంధీ మెమోరియల్ కో-ఛైర్మన్ తయాబ్ కుండావాలా, రాజీవ్ కామత్, కార్యదర్శి రావు కల్వాల, బోర్డ్ సభ్యులు బి.యెన్. రావు, మహేంద్ర రావు, అనంత్ మల్లవరపు తో పాటు ఐఏఎన్టీ నాయకులు, వివిధ సంఘాల ప్రతినిధులు, పిల్లలు, పెద్దలు ఉత్సాహంగా పాల్గొన్నారు.

Next Story