- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Sankranti : జర్మనీని తాకిన తెలుగు సంస్కృతి.. విదేశీయులతో కలిసి సంక్రాంతి సంబురాలు
భారతీయ సంస్కృతుల(Indian cultures)కు విదేశీయులు(Foreigners) మంత్రముగ్ధులు అవుతారనే విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్ : భారతీయ సంస్కృతుల(Indian cultures)కు విదేశీయులు(Foreigners) మంత్రముగ్ధులు అవుతారనే విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇక్కడి ఫెస్టివల్స్(Indian festivals) ఖండాంతరాలను దాటి సెలబ్రేట్ చేసుకుంటున్నాయి. తాజాగా సంక్రాంతి పండుగ(Sankranti festival)ను జర్మనీలో అత్యంత వైభవంగా నిర్వహించుకున్నారు. జర్మనీ(Germany) దేశస్తులతో కలిసి ప్రవాస భారతీయులు అట్టహాసంగా భోగి పండుగను చేశారు.
జర్మనీలోని మన్హయిం(Manhaim Town) పట్టణంలో తెలుగు కమ్యూనిటీ వారు ఇంటర్నేషనల్ కల్చరల్ హౌస్ మన్హయిం (International Cultural House Mannheim-IKHM ) సిటీ ఆర్గనైజషన్ వారి సహకారంతో భారతీయులు సంక్రాంతి సంబురాలను ఘనంగా నిర్వహించుకున్నారు. భారతీయ సంస్కృతులను ప్రతిబింబించే విధంగా అంతర్జాతీయ వేదికపై మూడు రోజుల సంక్రాంతిని అత్యంత వైభవంగా జరుపుకున్నారు. ముఖ్యంగా జనవరి 12న తెల్లవారు జామునే భోగి మంటలను వేశారు. పిల్లలకు భోగి పళ్లు పోశారు. తెలుగు సంస్కృతి ఉట్టి పడేలా గాలి (పతంగులు) పటాలు పంపిణీ చేసిచ ఎగురవేశారు.
బొమ్మల కొలువు ఏర్పాటు చేసి, దాని విశిష్టతను వివరించారు. గ్రామీణ ప్రాంత సంక్రాంతి వేడుకలు తలపించేలా కోలాటాలు వేశారు. అతివలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. సంక్రాంతి లక్కీ డ్రాలో (బంగారు నాణెం) ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలలో భరత నాట్యం, ఆటలు, పాటలు, హులా హోప్ డాన్స్, బాలీవుడ్ డాన్స్‌లు, DJ సౌండ్స్ ఆధ్యంతం వీక్షకులను కట్టిపడేశాయి.
ఈ సంక్రాంతి సంబురాలకు మన్హయిం పట్టణంతోపాటు చుట్టూ ఉన్న ఇతర నగరాల్లోని భారతీయులు అందరూ సాంప్రదాయ వస్త్రధారణలో హాజరై జరుపుకోవడం విశేషం. జర్మనీ దేశంలో నివసించే పిల్లలకు భారతీయ సంస్కృతిని, పండుగలను, ఆధ్యాత్మిక జీవన విధానాలను, వాటి విశేషాలను తెలియజేయడమే ప్రధాన భూమికగా తాము పనిచేస్తున్నట్లు కార్యక్రమ ముఖ్య కార్య నిర్వాహకులు సత్యగణపతి రెడ్డిపల్లి(Sathyaganapathi Reddypalli) వివరించారు. అదే విధానాలతో ఇతర దేశాల సంస్కృతుల పరిచయ వేదికగా ఉన్న IKHM జర్మనీ ఆర్గనైజేషన్(German Organization)తో పనిచేయడం సంతోషదాయకంగా ఉందని వివరించారు.






