న్యూజిల్యాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు

by Gantepaka Srikanth |

తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ న్యూజిల్యాండ్(New Zealand) ఆధ్వర్యంలో ఆదివారం ఆక్లాండ్ నగరంలో అంగరంగ వైభవంగా ‘బంగారు బతుకమ్మ’(Bathukamma Celebrations) కార్యక్రమాన్ని నిర్వహించారు.

న్యూజిల్యాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ న్యూజిల్యాండ్(New Zealand) ఆధ్వర్యంలో ఆదివారం ఆక్లాండ్ నగరంలో అంగరంగ వైభవంగా ‘బంగారు బతుకమ్మ’(Bathukamma Celebrations) కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ ధూమ్ ధాం వ్యవస్థాపకులు, మాజీ MLA రసమయి బాలకిషన్, మాజీ MLC కర్నే ప్రభాకర్ అలాగే ప్రముఖ మూవీ సింగర్ స్ఫూర్తి జితేందర్ పాల్గొని వారి సందేశాన్ని, శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం రసమయి తెలంగాణ ఉద్యమ పాటలు, స్ఫూర్తి బతుకమ్మ పాటలతో ప్రవాస తెలంగాణ ఆడబిడ్డలు ఆడి పాడి, గౌరమ్మ తల్లి పూజలతో బతుకమ్మ కార్యక్రమాన్ని నిర్వహించుకొని విజయవంతం చేశారు. మొదటి సారి రసమయి న్యూజిలాండ్ రావడం వలన పెద్ద ఎత్తున తెలంగాణ బిడ్డలు వారిని కలుసుకొని ఫొటోలు దిగి సంతోషాన్ని తెలియచేశారు.

ఈ కార్యక్రమానికి ప్రవాస తెలంగాణ నాయకులు పట్లోళ్ల నరేందర్ రెడ్డి, మేకల ప్రసన్న కుమార్, రోహిత్ రెడ్డి తమ్మినేని, ధర్మందర్ అల్లే, జగదీశ్వర్ రెడ్డి పట్లోళ్లతో పాటు అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు విశ్వనాథు బాల, విజేత యాచమనేని, వర్ష పట్లోళ్ల, స్వాతి మేకల, లింగం గుండెల్లి, కావ్యా మాశెట్టి, విశ్వనాథ్ అవిటి, రవి కుమార్ వట్టం, శశికాంత్ గున్నల, రమేష్ మెరుగు, విజయ్ శ్రీరామ్, మధు ఎర్ర, కిరణ్మయి, శైలజ బాలకుల్ల, రమేష్ రెడ్డి రామిండ్ల, హరీష్, శ్రీనివాస్ గాజుల, కిరణ్ కుమార్ కొమ్ముల, సందీప్ నాగుల, ప్రమోద్ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Next Story