- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మలేషియాలో బతుకమ్మ సంబురాలు
మలేషియా తెలంగాణ అసోసియేషన్ (మైటా) ఆధ్వర్యంలో 12వ వార్షికోత్సవ బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: మలేషియా తెలంగాణ అసోసియేషన్ (మైటా) ఆధ్వర్యంలో 12వ వార్షికోత్సవ బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మలేషియాలో ఇండియన్ హై కమిషనర్ బీఎన్ రెడ్డి హాజరయ్యారు. గత పన్నెండేళ్లుగా మైటా చేస్తున్న సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబింబించేలా పండుగల సందర్భంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలను బీఎన్ రెడ్డి అభినందించారు. సరిహద్దులు దాటి వచ్చినా కూడా మన సాంప్రదాయాన్ని ఇంత పెద్దఎత్తున 150 పైగా బతుకమ్మలు, 2వేల మంది మహిళలు హాజరవ్వడాన్ని అయన కొనియాడారు. ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి మైటా చేస్తున్న కార్యక్రమాలకు తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం తరఫున సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమానికి మాజీ ఆసియా పసిఫిక్ సుందరి రష్మి ఠాకూర్ హాజరయ్యారు.
తెలంగాణ జానపద గాయని నాగలక్ష్మి తన పాటలతో అలరించారు. డాన్స్ మాస్టర్ నరేష్ ఆధ్వర్యంలో చిన్నారులు, మహిళలు తెలంగాణ జానపద పాటలకు చేసిన నృత్యప్రదర్శన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. మైటా ప్రెసిడెంట్ సైదం తిరుపతి, వైస్ ప్రెసిడెంట్ చిరుత చిట్టిబాబు, మహిళా ప్రెసిడెంట్ కిరణ్మయి, జనరల్ సెక్రటరీ సందీప్ గౌడ్, జాయింట్ సెక్రటరీ సత్యనారాయణ రావు, ట్రెజరర్ సందీప్ కుమార్ లగిశెట్టి, జాయింట్ ట్రెజరర్ సుందర్ రెడ్డి, యూత్ ప్రెసిడెంట్ సంతోష్ దాసరాజు, యూత్ వైస్ ప్రసిడెంట్ శివ తేజ, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ మారుతి, హరి ప్రసాద్, రాములు, రమేష్, మహేష్ మార్త, మధు , జీవన్ రెడ్డి, వినోద్, రఘుపాల్ రెడ్డి, రంజిత్ రెడ్డి, జ్యోతి నాంపల్లి, సుప్రియ కంటే, పూర్ణ, అనిల్ రావు, హరీష్, శశి, అడ్వైజరీ మెంబర్స్ గురిజాల అమర్నాథ్ గౌడ్, సుధీర్, మన్సూర్ అహ్మద్, వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






