జడ్జీలను కించపరిచిన 49 మందికి నోటీసులు

by  |

దిశ, ఏపీ బ్యూరో: న్యాయమూర్తులను కించపరుస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన 49 మందికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. నోటీసులు అందిన వారిలో బాపట్ల ఎంపీ సురేశ్, చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కూడా ఉండటం గమనార్హం. నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ వ్యవహారంలో న్యాయస్థానం ఆదేశాలకు దురుద్దేశాన్ని ఆపాదిస్తూ న్యాయమూర్తులపై కొందరు బురదజల్లే ప్రయత్నం చేశారు. సోషల్ మీడియాలో న్యాయమూర్తులను కించపరుస్తూ పోస్టులు పెట్టారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ న్యాయవాది లక్ష్మీనారాయణ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ పిల్‌ను విచారించిన హైకోర్టు 49 మందికి నోటీసులు పంపింది.

Next Story

Most Viewed