ఘట్‌కేసర్‌లో నార్త్ అమ్మాయిల నయా మోసం

388

దిశ, ఘట్ కేసర్: స్వచ్ఛంద సంస్థ పేరుతో కొంతమంది యూపీకి చెందిన అమ్మాయిలు మోసానికి పాల్పడుతున్నారు. పేదవారికి సాయం చేస్తున్నామంటూ రహదారిపై వచ్చిపోయేవారి దగ్గర డబ్బు వసూలు చేస్తున్నారు. ఈ రకం మోసం సోమవారం ఘట్ కేసర్ మండలంలో వెలుగులోకి వచ్చింది. కొంతమంది ఈజీ మనీకి అలవాటుపడిన ఉత్తర్ ప్రదేశ్ యువతులు ఘట్ కేసర్ లోని హైదరాబాద్-వరంగల్ రహదారిపై వాహనాలను ఆపి సంస్థ పేరు చెప్పకుండా డబ్బులు వసూలు చేస్తున్నారు.

వీరు గత కొంతకాలంగా ఇదే తరహాలో వాహనదారుల నుండి డబ్బులు వసూళ్లు చేస్తున్నారు. డబ్బులు ఇస్తే ఓకే… లేదంటే ఈ కిలేడీలు రెచ్చిపోతారు. నోటికొచ్చినట్టు డబ్బులు ఇవ్వని వారిని దుర్భాషలాడడం స్టార్ట్ చేస్తారు. ఇదే విషయమై కొంతమంది పోలీసులకు సమాచారం అందించగా… అధికారులు ఆరుగురు యువతులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దీంతో హైవేపై హైక్లాస్ గా దోచుకుంటున్న ఈ నార్త్ బ్యూటీస్ కి బ్రేక్ పడింది. కాగా హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఇలాంటి ముఠాలు ఉన్నాయని.. వీరిపట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..