సినిమా షూటింగ్‌లో తీవ్రంగా గాయపడ్డ హీరోయిన్..

by  |
సినిమా షూటింగ్‌లో తీవ్రంగా గాయపడ్డ హీరోయిన్..
X

దిశ, సినిమా : బ్యూటిఫుల్ నోరా ఫతేహి ‘భుజ్ : ది ప్రైడ్ ఆఫ్ ఇండియా’ సినిమాలో కీ రోల్ ప్లే చేస్తున్న విషయం తెలిసిందే. 1971 ఇండియా – పాకిస్తాన్ వార్ నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రం యాక్షన్ సీక్వెన్స్ చేస్తున్న సమయంలో తీవ్రంగా గాయపడింది. కో-యాక్టర్‌తో ప్రాక్టీస్ చేసే సమయంలో మెటల్ హెవీ గన్ తన ఫేస్‌కు తగలడంతో బ్లడ్ వచ్చిందని, అయితే రియలిస్టిక్‌గా ఉంటుందని డైరెక్టర్ ఇదే షూట్ చేశారని చెప్పింది. ఆ తర్వాత హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ తీసుకున్నానని తెలిపింది. రిహార్సల్స్‌లో పర్‌ఫెక్ట్‌గా చేసినా.. షూటింగ్‌కు ఐదు నిమిషాల ముందు ఇలా జరిగిందన్న నోరా.. ఆ మరుసటి రోజు ప్లాన్ చేసిన చేజ్ సీక్వెన్స్‌లో పడిపోవడంతో మళ్లీ గాయపడ్డానని, దీంతో షూటింగ్ మొత్తం స్లింగ్ ధరించాల్సి వచ్చిందని వివరించింది. అయితే ఫిజికల్‌గా టఫ్ సీక్వెన్స్‌తో కూడిన ‘భుజ్ : ది ప్రైడ్ ఆఫ్ ఇండియా’లో డూప్ లేకుండానే స్టంట్స్ చేశానని.. అమేజింగ్ లర్నింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చిన సినిమా చేయడం అదృష్టంగా ఫీల్ అవుతున్నట్లు చెప్పింది. ఇక ఈ చిత్రం ద్వారా ఏర్పడిన శారీరక గాయాలను జీవితాంతం గర్వంగా ధరిస్తానని తెలిపింది నోరా.


Next Story

Most Viewed