నడిరోడ్డుపై ‘బాహుబలి’ భామ స్కిన్ షో.. వాటిని చూపిస్తూ దారుణంగా

138

దిశ, వెబ్‌డెస్క్: ‘బాహుబలి ది బిగినింగ్’ చిత్రంలో మనోహరీ పాటను ఎవరు అంత త్వరగా మర్చిపోలేరు. ఇక అందులో బాలీవుడ్ హాట్ బ్యూటీ నోరా ఫతేహి అందాలను, స్టెప్పులను మర్చిపోవడం జరగని పని. అమ్మడు అన్ని అందాలను ఎరగా వేసి కుర్రకారుకు నిద్రపట్టనివ్వకుండా చేసింది. ఇక ఎప్పటికప్పుడు నోరా సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలుస్తోంది. ఫ్యాషన్ ఐకాన్ గా మారిపోతున్న ఈ భామ చిట్టిపొట్టి దుస్తులతో ముంబై వీధుల్లో విహరిస్తూ మీడియా కంటికి కనువిందు చేస్తోంది. తాజాగా అమ్మడు ముంబై వీధుల్లో తిరుగుతున్న ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

అందాలను అస్సలు దాచుకోలేని నోరా వచ్చిన ఏ అవకాశాన్ని వదిలిపెట్టకుండా సద్వినియోగం చేసుకుంటోంది. బాహుబలి మనోహరిగా తన పాపులారిటీ ఒక రేంజులోనే ఉండడం, మరోపక్క డాన్స్ లతో అదరగొట్టడంతో హాట్ బ్యూటీ వరుస అవకాశాలను అందుకొంటుంది. ఇక టెంప్టింగ్ ఫోటో షూట్లతో ఇన్ స్టాలో దాడి చేయడం నోరా ప్రత్యేకత అని అందరికి తెలిసిందే. తాజాగా టాప్ టూ బాటమ్ తెలుపు ఫ్రాకులో  నోరా అగ్గిరాజేస్తోంది. దాదాపు టాప్ లెస్ గా కనిపిస్తున్నా ఆ టాప్ లో ఎద  అందాలను నిర్మొహమాటంగా ఆరబోసింది. మరోపక్క సన్నజాజి నడుము అందాలు ఇంకా ఎలివేట్ చేయడంతో అమ్మడు హాట్ షో కి కుర్రకారు ఫిదా అయిపోతున్నారు. పైన పటారం.. లోన లొటారం అన్నట్లు పైకి డ్రెస్ కనిపిస్తున్నా.. అందాలను ఎంచక్కా ఆరబోస్తోందిగా అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మరోపక్క మరీ ఇంత దారుణమా..? ఎంతమాత్రం గ్లామర్ ప్రపంచంలో ఉంటే రోడ్డుపై ఇలా కనిపించాలా అంటూ నోళ్లు నొక్కుకుంటున్నారు   ప్రస్తుతం నోరా హాట్ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..