డ్యాన్సింగ్ క్వీన్ నోరా ఇన్‌స్పిరేషనల్ స్టోరీ..

by  |
డ్యాన్సింగ్ క్వీన్ నోరా ఇన్‌స్పిరేషనల్ స్టోరీ..
X

దిశ, వెబ్‌డెస్క్: ‘దిల్ బర్ దిల్ బర్’ అంటూ కుర్రకారులో జోష్ నింపిన నోరా ఫతేహి.. ప్రజెంట్ బాలీవుడ్ ఐటెం క్వీన్‌గా రాజ్యమేలుతోంది. సెల్ఫ్ టాట్ డ్యాన్సర్ అయిన తాను ఫుల్ గ్రేస్‌తో స్టెప్స్ వేస్తుంటే.. వావ్ అంటూ కళ్లార్పకుండా చూస్తుండిపోయే లక్షలమంది అభిమానులను సంపాదించుకుంది నోరా. కానీ కెరియర్ స్టార్టింగ్‌లో అసలు తను ఎందుకు పనికి రానని.. ఇక నీ దేశానికి(కెనడా) వెళ్లిపోవచ్చని చాలా మంది కామెంట్ చేయడంతో పాటు బెదిరింపులకు కూడా గురిచేశారన్న నోరా.. ఎవరేమన్నా సరే ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలనే లక్ష్యంతో ఇక్కడే ఉన్నానని, తనను తాను ప్రూవ్ చేసుకున్నానని తెలిపింది.

వెయిట్రెస్‌గా లైఫ్ స్టార్ట్ చేసి, మెన్స్ క్లాథింగ్ సెంటర్‌లో సేల్స్ అసోసియేట్‌గా పనిచేసిన నోరా ఫతేహి.. కెనడాలో లాటరీ టికెట్స్ కూడా అమ్మానని చెప్పుకొచ్చింది. చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే ఉన్న ఇంట్రెస్ట్‌తో ఫిల్మ్ కెరియర్ స్టార్ట్ చేయాలని భావించిన తను.. కెనడాలో ఓ మోడలింగ్ ఏజెన్సీ ద్వారా ఇండియాకు చేరుకుంది. మోడల్స్ పట్ల ఆ కంపెనీ అగ్రెసివ్‌నెస్‌కు భయపడి మొదట అక్కడి నుంచి వెళ్లిపోవాలని అనుకోగా.. తను చేసిన రూ. 20 లక్షల రూపాయలు మాత్రం వెనక్కి ఇచ్చేది లేదని సదరు కంపెనీ తేల్చేయడంతో తన ప్రయత్నాన్ని విరమించుకున్నట్టు వెల్లడించింది.

ఆ తర్వాత ఇండియాకు చేరుకున్నాక ఆడిషన్స్ టైమ్‌లో చాలా కష్టాలు పడ్డానని.. వెకిలి నవ్వులు, అవమానాలతో బాధపడ్డానని చెప్పింది. ఆడిషన్ చేయమని అడుక్కోవాల్సి వచ్చేదని.. ఫోన్ కాల్స్, మెసేజ్‌లకు ఎలాంటి సమాధానం వచ్చేది కాదని తెలిపింది నోరా. ఒక లేడీ కాస్టింగ్ డైరెక్టర్ అయితే ‘ఇంకెందుకు ఇక్కడే ఉన్నావ్.. నీలాంటి వాళ్లు చాలా మంది ఉన్నారు. మీ దేశానికి వెళ్లిపోయి అంతకుముందు చేసిన పనిలోనే కంటిన్యూ అయిపో’ అని సలహా ఇచ్చినట్టు చెప్పింది. కానీ డ్రీమ్ ఫుల్‌ఫిల్ చేసుకుంటానని.. పాషన్‌ను వదులుకోలేనని డిసైడ్ అయిన నోరా.. యాక్టర్, డ్యాన్సర్, పర్ఫార్మర్‌గా ఆడియన్స్‌ను ఎంటర్టైన్ చేయాలని.. అప్పటి వరకు ఎన్ని కష్టాలు పడ్డా పరవాలేదనే దృఢ సంకల్పంతో ముందుకు సాగానని చెప్పుకొచ్చింది.

ప్రతీ ఒక్కరికి ఒక టైమ్ వస్తుంది కదా.. అలాగే తనకూ టైమ్ వచ్చింది. రోజులు మారాయి.. ప్రజలు ఆదరించారు. తన స్ప్లెండిడ్ పర్‌ఫార్మెన్స్‌కు ఫిదా అయ్యారని ఆనందం వ్యక్తం చేసింది నోరా. తనను కాదన్న వాళ్లే.. ఇప్పుడు కావాలి అంటున్నారని, అలాంటి వాళ్ల మధ్యనే వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉందని తెలిపింది.


Next Story

Most Viewed