పెళ్లి చేసుకున్న ‘నోబిటా’

by Shyam |

<p>దిశ, వెబ్‌డెస్క్: చిన్నారులకు ఎంతో ఇష్టమైన కార్టూన్ క్యారెక్టర్స్‌లో ‘డోరేమాన్’ ‘నోబిటా’ తప్పకుండా ఉంటాయి. డోరేమాన్ ఆధారంగా సీరియల్స్, పుస్తకాలు రాగా, 2014లో ‘స్టాండ్ బై మీ డోరెమోన్’ చిత్రం కూడా వచ్చింది. ఆ చిత్రానికి ఆరేళ్ల తర్వాత సీక్వెల్‌గా ‘స్టాండ్ బై మీ డోరెమాన్ 2’ తెరకెక్కగా, గతేడాది నవంబర్‌లో జపాన్‌లో మాత్రమే విడుదల కాగా, వచ్చే నెలలో అనేక దేశాలలో రిలీజ్ కాబోతున్న ఈ మూవీ పోస్టర్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. [&hellip;]</p>

పెళ్లి చేసుకున్న ‘నోబిటా’
X

దిశ, వెబ్‌డెస్క్: చిన్నారులకు ఎంతో ఇష్టమైన కార్టూన్ క్యారెక్టర్స్‌లో ‘డోరేమాన్’ ‘నోబిటా’ తప్పకుండా ఉంటాయి. డోరేమాన్ ఆధారంగా సీరియల్స్, పుస్తకాలు రాగా, 2014లో ‘స్టాండ్ బై మీ డోరెమోన్’ చిత్రం కూడా వచ్చింది. ఆ చిత్రానికి ఆరేళ్ల తర్వాత సీక్వెల్‌గా ‘స్టాండ్ బై మీ డోరెమాన్ 2’ తెరకెక్కగా, గతేడాది నవంబర్‌లో జపాన్‌లో మాత్రమే విడుదల కాగా, వచ్చే నెలలో అనేక దేశాలలో రిలీజ్ కాబోతున్న ఈ మూవీ పోస్టర్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఇంతకీ ఎందుకు ఆ పోస్టర్స్ వైరల్‌గా మారాయి? ‘నోబిటా’కు అందరూ ఎందుకు విషెస్ చెబుతున్నారు. అసలేం జరిగిందంటే..

‘నోబిటా’ ట్రెండింగ్ తెలుసుకునే ముందు ఓ సారి నోబిటా విశేషాలు చర్చించుకుందాం. నోబిటా నోబి అనేది డోరెమోన్ సిరీస్‌లో ఓ కల్పిత పాత్ర కాగా, దీన్ని ఫుజికో ఫుజియో( రైటర్స్ హిరోషి ఫుజిమోటో, మోటూ అబికో) సృష్టించారు. నోబితా అనేది వారి కలం పేరు కాగా, డోరెమోన్‌తో పాటు, నోబిటాకు విపరీతమైన పాపులారీటి వచ్చింది. తాజాగా నోబిటా.. మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ ట్రెండింగ్‌లో నిలవడానికి అతని పెళ్లే కారణం. కార్టూన్ క్యారెక్టర్ పెళ్లి చేసుకోవడం ఏంటనీ అనుకుంటున్నారా? అయితే డోరేమాన్ చూసే బిగ్ ఫ్యాన్స్ అందరికీ నోబితా, అతడి గర్ల్‌ఫ్రెండ్ షిజుకా గురించి కొత్తగా చెప్పనవసరం లేదు. నోబిటా ఎప్పుడూ తన స్నేహితురాలు షిజుకాను ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నిస్తూ విఫలమవుతాడు. కానీ, ఇప్పుడు రాబోతున్న ‘స్టాండ్ బై మీ డోరెమాన్ 2’ చిత్రంలో వీరిద్దరూ ఒక్కటి కాబోతున్న పోస్టర్స్‌ ఉండటంతో, ఎట్టకేలకు నోబిటా, షిజుకా కలిసిపోతున్నారని ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఎమోషనల్ ట్వీట్స్ పంచుకుంటున్నారు. ‘నోబిటా షిజుకాను వివాహం చేసుకోవడం అంటే మన బాల్యానికి వీడ్కోలు పలకడం కాదు. మనలోని పసి మనసుతో కనెక్ట్ అవ్వడం ఎలాగో మనకు తెలిసినంత కాలం మన బాల్యం మనల్ని ఎప్పటికీ వీడిపోదు’ ‘సో హ్యాపీ నోబిటా’ ‘యా హూ.. నోబిటా, షిజుకా కలుసుకున్నారు’ ‘నేను ఇప్పుడు ప్రశాంతంగా చచ్చిపోతాను’ ‘నోబిటా, షుజికా ఒక్కటయ్యారు సరే. కానీ, చోటాభీమ్, చుట్కీ ఏకమవ్వడానికి మరింత టైమ్ పడుతుంది’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా హ్యాష్‌టాగ్ నోబిటా, షిజుకా, డోరేమాన్‌ను(#nobita #Shizuka #doraemon #ChhotaBheem & #Chutki) ట్రెండ్ చేస్తున్నారు.

Next Story