- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆవిర్భావోత్సవంలో ఆర్భాటాలు వద్దు: శ్రీనివాస్ గౌడ్
<p>దిశ, మహబూబ్నగర్: టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఎలాంటి ఆర్భాటాలు లేకుండా చేసుకుంటామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించిన ఈ ఇరవై సంవత్సరాలలో కేసీఆర్ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆయన గుర్తు చేశారు. జాతీయ స్థాయిలో 33 పార్టీలను మెప్పించి, ఒప్పించి తెలంగాణను సాధించిన నాయకుడు కేసీఆర్ అని మంత్రి కొనియాడారు. ఆదివారం జిల్లాలోని పార్టీ కార్యలయంలో విలేఖరులతో మాట్లాడుతూ.. కేసీఆర్ అడుగు జాడలలో నడిచిన తాను అనుకున్న పనులను సాధించామని […]</p>

దిశ, మహబూబ్నగర్: టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఎలాంటి ఆర్భాటాలు లేకుండా చేసుకుంటామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించిన ఈ ఇరవై సంవత్సరాలలో కేసీఆర్ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆయన గుర్తు చేశారు. జాతీయ స్థాయిలో 33 పార్టీలను మెప్పించి, ఒప్పించి తెలంగాణను సాధించిన నాయకుడు కేసీఆర్ అని మంత్రి కొనియాడారు. ఆదివారం జిల్లాలోని పార్టీ కార్యలయంలో విలేఖరులతో మాట్లాడుతూ.. కేసీఆర్ అడుగు జాడలలో నడిచిన తాను అనుకున్న పనులను సాధించామని తెలిపారు. టీఆర్ఎస్ పార్టీలో ఉండటం తనకు గర్వంగా ఉందని శ్రీనివాస్ గౌడ్ చెప్పుకొచ్చారు. ఇబ్బందుల్లో ఉన్న వారికి ప్రతి కార్యకర్త సాయం చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి ఇంటిపై టీఆర్ఎస్ జెండా ఎగరవేయాలని, అలాగే వారం పాటు రక్తదాన కార్యక్రమాలు చేపట్టాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు.
tag: minister srinivas goud, comments, no public celebrations, trs party, mahabubnagar






