పెళ్లే వద్దంటున్న టాలీవుడ్ యంగ్ హీరోలు

by  |
పెళ్లే వద్దంటున్న టాలీవుడ్ యంగ్ హీరోలు
X

టాలీవుడ్ యంగ్ హీరో సాయి ధరమ్ తేజ హీరోగా రాబోతున్న చిత్రం ‘సోలో బ్రతుకే సో బెటర్’. ఈ చిత్రానికి సంబంధించి ఈరోజు (సోమవారం) విడుదలైన ఓ పాట గురించి ట్విట్టర్‌లో ఆసక్తికరమైన చర్చ జరిగింది. ‘అప్పుడెప్పుడో నా బర్త్‌డేకి గిఫ్ట్‌ ఇస్తా అన్నావ్.. ఎక్కడ నీ గిఫ్ట్‌, ఎప్పుడిస్తావ్‌.. నేను వెయిటింగ్‌ సాయి’ అంటూ నితిన్‌ ట్వీట్ చేశాడు. దీనికి స్పందించిన సాయి ధరమ్ తేజ్.. ‘సోలో బ్రతుకే సో బెటర్‌’ చిత్రంలోని పాటను విడుదల చేయాల్సింది నువ్వే(నితిన్‌) డార్లింగ్‌. ఈ పాట మా సింగిల్స్‌ నుంచి మీ మింగిల్స్‌కు అంకితం’ అంటూ నితిన్‌కు బదులిచ్చాడు. అన్నట్లుగా నితిన్ ఈ పాటను రిలీజ్ చేయగా, అందులో ముగ్గురు హీరోలు కనిపించడం విశేషం.

ఈ చిత్రం నుంచి ‘నో పెళ్లి, దాని తల్లి.. ఈ తప్పే చేయకురా వెళ్లి’ అనే పాటను ట్విట్టర్ వేదికగా విడుదల చేసిన నితిన్.. సాంగ్ అద్భుతంగా ఉంద‌న్నాడు. పనిలో పనిగా ‘తేజు’ పెళ్లి పైనా ట్వీట్ చేశాడు. ‘నేనూ చూస్తా ఎన్ని రోజులిలా సింగిల్‌గా ఉంటావో.. కొన్నిసార్లు చేసుకోవ‌డంలో టైమ్ గ్యాప్ ఉంటుందేమో కానీ చేసుకోవ‌డం ప‌క్కా’ అంటూ త‌న‌దైన స్టైల్‌లో కామెంట్ చేశాడు నితిన్. ‘ఈ సాంగ్‌లో భాగం కావ‌డం చాలా ఫ‌న్‌గా ఉందంటూ’ వ‌రుణ్ తేజ్ తెలిపారు. ‘నా యూత్‌లో టంగ్ స్లిప్ అయ్యాను సాయితేజ్‌’ అని రానా అన్నారు. నితిన్ విడుదల చేసిన ఈ పాటలో సాయితేజ్‌తో పాటు వ‌రుణ్‌ తేజ్, రానా సంద‌డి చేయ‌డం విశేషం. ఎస్‌.ఎస్‌. త‌మ‌న్ సంగీతం అందించిన ఈ పాట‌ను రఘురామ్ రాయ‌గా.. అర్మాన్ మాలిక్ పాడారు. సుబ్బు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్‌పీ (SVCC) బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.



Next Story

Most Viewed