- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కిమ్‌కు ఆపరేషన్లేమీ జరగలేదు : దక్షిణ కొరియా
<p>సియోల్ : ఉత్తర కొరియా అధ్యక్షుడు, సుప్రీంలీడర్ కిమ్ జోంగ్ ఉన్ కొన్ని రోజుల అజ్ఞాతం వీడి గత శనివారం ప్రజలకు కనిపించారు. ఆయన అధికారిక కార్యక్రమాలకు.. ముఖ్యంగా కొరియాలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే తన తాతయ్య జయంతి వేడుకలకు కూడా హాజరు కాలేదు. దీంతో కిమ్ ఆరోగ్యంపై ఊహాజనిత వార్తలు బయటకు వచ్చాయి. కిమ్‌కు హృద్రోగ సంబంధిత శస్త్ర చికిత్స జరిగిందని.. అతను మరణ శయ్యపై ఉన్నాడని వార్తలు బయటకు పొక్కాయి. ఒకానొక దశలో అయితే […]</p>

సియోల్ : ఉత్తర కొరియా అధ్యక్షుడు, సుప్రీంలీడర్ కిమ్ జోంగ్ ఉన్ కొన్ని రోజుల అజ్ఞాతం వీడి గత శనివారం ప్రజలకు కనిపించారు. ఆయన అధికారిక కార్యక్రమాలకు.. ముఖ్యంగా కొరియాలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే తన తాతయ్య జయంతి వేడుకలకు కూడా హాజరు కాలేదు. దీంతో కిమ్ ఆరోగ్యంపై ఊహాజనిత వార్తలు బయటకు వచ్చాయి. కిమ్‌కు హృద్రోగ సంబంధిత శస్త్ర చికిత్స జరిగిందని.. అతను మరణ శయ్యపై ఉన్నాడని వార్తలు బయటకు పొక్కాయి. ఒకానొక దశలో అయితే కిమ్ చనిపోయాడనీ, అతని చెల్లి ఉత్తర కొరియా అధ్యక్షురాలు కాబోతోందనీ అంతర్జాతీయ మీడియా వార్తలు రాసింది. కానీ, వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ కిమ్ ఆరోగ్యంతో ప్రజల ముందుకు వచ్చారు. అయితే కిమ్‌కు ఎలాంటి శస్త్ర చికిత్స జరగలేదని దక్షిణ కొరియా స్పష్టం చేస్తోంది. అతని ఆరోగ్యం భేషుగ్గానే ఉందని.. ఎలాంటి చికిత్సలు తీసుకోలేదని కొరియాకు చెందిన సీనియర్ అధికారి చెబుతున్నాడు. నిరంతరం కొరియాపై నిఘావేసి ఉంచే దక్షిణ కొరియా కిమ్ గురించి ఆ మేరకు స్పష్టత నిచ్చింది.
Tags : Kim Jong Un, North Korea, South Korea, Kim Health






