లాక్ డౌన్ ఎత్తివేత: దానిపై ఇంకా రాని స్పష్టత

by  |
లాక్ డౌన్ ఎత్తివేత: దానిపై ఇంకా రాని స్పష్టత
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో లాక్ డౌన్ పూర్తిగా ఎత్తివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వైద్యశాఖ ఇచ్చిన నివేదికను పరిశీలించిన కేబినెట్.. రాష్ట్రంలో కరోనా నియంత్రణలోకి వచ్చిందని భావించి లాక్ డౌన్‌లో విధించిన అన్ని రకాల నిబంధనలు పూర్తిగా ఎత్తేసింది. రేపటి నుంచి లాక్ డౌన్ ఎత్తివేత అమల్లోకి రానుండగా.. యథావిధిగా అన్ని కార్యకలాపాలు సాగనున్నాయి. బస్సులు, మెట్రో సర్వీసులు యథావిధిగా కార్యకలాపాలు సాగించనున్నాయి.

ఇక పబ్బులు, సినిమా హాళ్లు, బార్లు, పార్కులు ఓపెన్ కానున్నాయి. అయితే అంతరాష్ట్ర బస్సు సర్వీసులపై ఇంకా స్పష్టత రాలేదు. లాక్ డౌన్ నిబంధనల్లో భాగంగా అంతరాష్ట్ర బస్సు సర్వీసులపై తెలంగాణ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఇప్పుడు లాక్ డౌన్ ఎత్తివేయడంతో అంతరాష్ట్ర బస్సు సర్వీసులు నడుస్తాయా?..లేదా? అనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు.

ఏపీలో సాయంత్రం 6 నుంచి కర్ఫ్యూ అమల్లో ఉండటంతో.. అంతరాష్ట్ర బస్సు సర్వీసులు తిరుగుతాయా.. లేదా అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఇరు రాష్ట్రాల ఆర్టీసీ అధికారులు త్వరలో దీనిపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశముంది.

Next Story

Most Viewed