- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అందరి చూపు కవిత వైపే.. నిజామాబాద్ లో ‘ఎమ్మెల్సీ’ల టెన్షన్..
<p>దిశ ప్రతినిధి, నిజామాబాద్: తెలంగాణలో ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల సందడి నెలకొంది. నిజామాబాద్ సిట్టింగ్ ఎమ్మెల్సీ కవిత రెండో సారి స్థానిక సంస్థల బరిలో దిగుతారా లేక ఎమ్మెల్యేల కోటాలో పోటీ చేస్తారా అనే దానిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కవిత పోటీ పై ఆ పార్టీలోని సీనియర్లు ఆశవాహుల భవితవ్యం ఆధారపడి ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ తో రాజకీయాలు హాట్ హాట్ గా […]</p>

దిశ ప్రతినిధి, నిజామాబాద్: తెలంగాణలో ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల సందడి నెలకొంది. నిజామాబాద్ సిట్టింగ్ ఎమ్మెల్సీ కవిత రెండో సారి స్థానిక సంస్థల బరిలో దిగుతారా లేక ఎమ్మెల్యేల కోటాలో పోటీ చేస్తారా అనే దానిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కవిత పోటీ పై ఆ పార్టీలోని సీనియర్లు ఆశవాహుల భవితవ్యం ఆధారపడి ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ తో రాజకీయాలు హాట్ హాట్ గా మారాయి. ఒకే సారి రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి. ఎమ్మెల్యేల కోటాలో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీ గా ఎన్నికైన ఆకుల లలిత పదవీకాలం ముగిసింది. టీఆర్ఎస్ లో చేరిన ఆమె రెన్యూవల్ ఆశిస్తున్నారు.
పార్టీ విలీనం చేస్తున్నట్లు ప్రకటించిన లలిత కు మళ్ళీ ఛాన్స్ ఇస్తామని అప్పట్లో స్వయంగా సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. అయితే మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యం లో ఆమెకు రెండో సారి అవకాశం వచ్చే చాన్స్ కనిపించడం లేదు. ఇంకోవైపు స్థానిక సంస్థల కోటా లో గెలిచిన కల్వకుంట్ల కవిత పదవీకాలం కూడా జనవరి 4 తో ముగిసిపోతుంది. అయితే రెండో సారి స్థానిక సంస్థల నుంచి బరిలో దిగుతారా లేక నేరుగా ఎమ్మెల్యేల కోటాలో నామినేషన్ వేస్తారా అనేదానిపై పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది. ఈ రెండింటికి దూరంగా ఉండి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తారా అనేదానిపై కూడా రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
స్ధానికంగా ఎలాంటి వ్యతిరేకత రాకుండా ఎమ్మెల్యేల కోటాలో అవకాశం కల్పిస్తారేమోనని కొందరు సీనియర్లు గుసగుసలాడుకుంటున్నారు. ఎమ్మెల్యేల కోటా లో కవితకు పదవి ఇచ్చి స్థానిక సంస్ధల కోటాలో లోకల్ లీడర్లకు ఇస్తే అన్ని విధాలా కలిసొస్తుందన్న యోచనలో కూడా కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. ఎలాగూ అసెంబ్లీ ఎన్నికలు మరో రెండేళ్లలో వస్తాయి. ఒక వేళ ముందస్తుకు వెళితే ఏడాదిలోనే వచ్చే అవకాశముంది. ఈ విషయంలో కేసీఆర్ వ్యూహాత్మకంగా ఆచి తూచి వ్యవహరిస్తారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
ఎలాంటి మార్పు లేకుండా స్థానిక కోటలో కవిత పోటీ చేస్తే మాత్రం ఎమ్మెల్యేల కోటా నుంచి మరొకరికి చాన్స్ రాకపోవచ్చని నేతల్లో గుబులు మొదలైంది. ఎమ్మెల్యే కోటాలో కవిత కు అవకాశం ఇస్తే స్థానిక సంస్థల నుంచి మరొకరికి చాన్స్ లభిస్తుంది. అయితే రెన్యూవల్ కోసం ఎదురు చూస్తున్న ఆకుల లలిత తో పాటు మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర రావు, మాజీ ఎమ్మెల్సీ నర్సారెడ్డి లలో ఒకరికి అవకాశం దక్కనున్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ నిర్ణయం ఎలా ఉంటుందోననే ఉత్కంఠ, ఆసక్తి పార్టీ వర్గాల్లో నెలకొంది. జిల్లా ఎమ్మెల్సీ పదవుల్లో ఒకటి మాత్రం కవితకు ఖాయం కాగా, ఇంకోక అవకాశం ఎవరిని వరిస్తుందో అనేది ఆసక్తిని రేకెత్తిస్తోంది..






