కేటాయించిన రోజే ధాన్యాన్ని తేవాలి: కలెక్టర్ నారాయణరెడ్డి

by  |

దిశ, నిజామాబాద్: రైతులు తమకు కేటాయించిన రోజే ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలని కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. గురువారం గుండారంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ కరోనా నివారణకు తప్పనిసరిగా సామూహిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించాలని కోరారు. తమకు కేటాయించిన రోజు మాత్రమే ధాన్యం తీసుకురావాలని సూచించారు. అనంతరం ఆర్‌‌కే మాడ్రన్ రైస్ మిల్లును సందర్శించారు. వీలైనంత ఎక్కువ మంది హమాలీలతో ధాన్యాన్ని త్వరగా దింపేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఖాళీ చేసిన గన్నీ బ్యాగులను వెంటనే సివిల్ సప్లై గోదాంకి అందజేయాలని కోరారు. ఆయన వెంట అడిషనల్ కలెక్టర్ బి చంద్రశేఖర్, డీఎం అభిషేక్ సింగ్, తహసీల్దార్ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

Tags: Nizamabad, collector, Narayana Reddy, visit, gundaram village, crop purchase center


Next Story

Most Viewed