నిజామాబాద్‌లో కంటైన్మెంట్ జోన్లను పరిశీలించిన కలెక్టర్

by  |
నిజామాబాద్‌లో కంటైన్మెంట్ జోన్లను పరిశీలించిన కలెక్టర్
X

దిశ, నిజామాబాద్: నిజామాబాద్ నగరంలోని కంటైన్మెంట్‌ జోన్ ప్రాంతాలను మున్సిపల్ కమిషనర్ జితేష్ వి పాటిల్‌తో కలిసి కలెక్టర్ సీ నారాయణరెడ్డి పరిశీలించారు.పెద్ద బజార్‌లోని వాటర్ ట్యాంక్ వద్ద ఏర్పాటు చేసిన జీరో టచ్ వాష్ బేషన్‌ను పరిశీలించారు. అనంతరం మెడికల్ సిబ్బందితో మాట్లాడి వారికి కొన్ని సూచనలు చేశారు. హొం క్వారంటైన్‌లో ఉన్నవారిని ప్రతిరోజు పరీక్షించాలని ఆదేశించారు. రక్త నమూనాలు సేకరించాలని తెలిపారు. ప్రజలకు నేరుగా నిత్యావసర సరుకులు అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సిబ్బంది కచ్చింతంగా మాస్కు, కళ్ల అద్దాలు, గ్లౌజులు ధరించాలన్నారు. కరోనా నివారణకు సోషల్ డిస్టెన్స్ తప్పనిసరి అని తెలిపారు. శాంపిల్స్ నెగిటివ్ వచ్చిన వారు కూడా హోం క్వారంటైన్ లో ఉండాలని అన్నారు. వారి వెంట మున్సిపల్ ఇంజినీర్ ఆనందసాగర్, డీఈ రషీద్ ఉన్నారు.

Tags:Nizamabad,collector,Narayanareddy,continement area’s


Next Story