క్వారంటైన్ టూ వకీల్ సాబ్

117

దిశ, వెబ్‎డెస్క్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్ కం బ్యాక్ మూవీ “వకీల్ సాబ్” చిత్రంలో నటించిన నివేదా థామస్‎కు కరోనా వచ్చిన విషయం తెలిసిందే. అయితే కొన్ని రోజులుగా క్వారంటైన్‎లో ఉన్న ఈ భామ “వకీల్ సాబ్” సినిమా ప్రదర్శింపబడుతున్న థియేటర్‎లో ప్రత్యేక్షమైంది. ఈ అమ్మడు థియేటర్‎లో నిలబడి సినిమాను చూస్తున్న ఫోటోను షేర్ చేస్తూ.. “ఈ క్షణం కోసమే ఎదురు చూస్తున్నాను.. మాటలు లేవు” అంటూ ట్వీట్ చేసింది. ఈ పోస్ట్‎ను చూసిన నెటిజన్లు కరోనా కారణంగా “వకీల్ సాబ్” మూవీ ప్రమోషన్స్ లో ఎక్కడ కనపడని నివేదా.. అప్పుడే కరోనా నుంచి కోలుకుందా అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయినప్పటికీ కరోనా నిబంధనలకు అనుగుణంగానే అన్ని జాగ్రత్తలు తీసుకునే నివేదా సినిమాకు వెళ్లినట్లు తెలుస్తోంది.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..