స్పెషల్ టాలెంట్ చూపించిన నటి నివేదా థామస్.. ఫ్యాన్స్ ఫిదా

by  |
nivetha-thomas
X

దిశ, సినిమా : హీరోయిన్ నివేదా థామస్ తన యాక్టింగ్ స్కిల్స్‌తో ప్రస్తుతమున్న హీరోయిన్స్‌లో ది బెస్ట్ అనిపించుకుంది. రీసెంట్‌గా వచ్చిన ‘వకీల్ సాబ్’లో నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకున్న నివేద.. తాజాగా మరో ఆర్ట్‌తో ఇంటర్నెట్‌ను ఇంప్రెస్ చేసింది. గిటార్ ప్లే చేస్తూ పాటపాడిన టాలెంటెడ్ యాక్ట్రెస్.. నెటిజన్ల నుంచి బిగ్గెస్ట్ కాంప్లిమెంట్స్ అందుకుంది.

పాపులర్ హిందీ పిక్చర్ ‘జానే తు యా జానేనా’ నుంచి ‘కభి కభి’ సాంగ్ పాడి అందరినీ ఫిదా చేసేసింది. తన ఎక్స్‌ట్రార్డినరీ స్కిల్స్ గురించి కేవలం ఫ్యాన్స్ మాత్రమే కాదు సెలబ్రిటీలు సైతం ప్రశంసించగా.. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అయింది. ఇక ప్రస్తుతం సౌత్ కొరియన్ యాక్షన్ కామెడీ మూవీ‘ మిడ్‌నైట్ రన్నర్స్’ రీమేక్ ‘శాకినీ ఢాకినీ’ ప్రాజెక్ట్‌తో బిజీగా ఉంది. సుధీర్ వర్మ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో రెజీనా కాసెండ్రా మరో లీడ్ రోల్ ప్లే చేస్తోంది.

https://twitter.com/i_nivethathomas/status/1409764217482223619?s=20


Next Story