పుష్ప లో నివేద థామస్ కూడా…

by  |
పుష్ప లో నివేద థామస్ కూడా…
X

పుష్ప… సినిమా టైటిల్ అనౌన్స్మెంట్, ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ తర్వాత మంచి బజ్ క్రియేట్ అయింది. సుకుమార్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ పుష్పరాజ్ పాత్రతో మరో కోణాన్ని చూపించబోతున్నాడు. స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే కథలో బన్నీ డ్రైవర్ కాగా.. హీరోయిన్ రష్మిక మందన గిరిజన యువతిగా కనిపించనుంది. ఈ సినిమాతో నటిగా తనను తాను కొత్తగా చూపించుకునే చాన్స్ వస్తుందని… ఇంత గొప్ప పాత్ర ఇంత త్వరగా తనకు లభిస్తుందని అనుకోలేదని తెలిపింది రష్మిక.

అయితే ఈ సినిమాలో మరో హీరోయిన్ కు కూడా అవకాశం ఉందట. ఈ పాత్ర సినిమాకు కీలకంగా ఉంటుండగా… నివేద థామస్ ను సుకుమార్ సంప్రదించినట్లు సమాచారం. నిన్ను కోరి, జెంటిల్ మెన్, జై లవకుశ, బ్రోచేవారెవరురా, దర్బార్ లాంటి సినిమాల ద్వారా నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నివేదకు ఇది మరో మంచి అవకాశమని తెలుస్తోంది. ఆల్మోస్ట్ నివేద కన్ఫర్మ్ కాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం తెలుగులో V సినిమా చేయగా… విడుదల కావాల్సి ఉంది. కాగా పుష్ప లో విజయ్ సేతుపతితో పాటు బాలీవుడ్ నటులు సునీల్ శెట్టి నటిస్తున్నట్లు సమాచారం.

Tags: Allu Arjun, Sukumar, Rashmika Mandanna, Niveda Thomas, Mythri Movie Makers

Next Story