ఎమ్ఎస్ఎమ్ఈలకు రూ. లక్ష కోట్ల నిధి!

by  |
ఎమ్ఎస్ఎమ్ఈలకు రూ. లక్ష కోట్ల నిధి!
X

సూక్ష్మ, చిన్న మధ్య తరహా(ఎమ్ఎస్ఎమ్ఈ)ల బకాయిలను చెల్లించేందుకు వీలుగా, నిధుల ఇబ్బందులను తొలగించడానికి కేంద్ర ప్రభుత్వం రూ. లక్ష కోట్ల పథకాన్ని ఏర్పాటు చేసే యోచనలో ఉంది. ఈ అంశాన్ని కేంద్రమంత్రి నితిన్ గడ్కరి తెలిపారు. దీనికి ఆర్థిక శాఖ ఆమోదం రాగానే పరిశీలనకు పంపిస్తామని స్పష్టం చేశారు. అలాగే, చెల్లింపులు జరిపే సంస్థకు, అందుకుంటున్న సంస్థకు, బ్యాంకులకూ మధ్య వడ్డీ భారం ఏ రకంగా విభజించాలనే దానికోసం ప్రత్యేక విధానాన్ని రూపొందిస్తున్నామని నితిన్ గడ్కరి వివరించారు.

కేంద్రం ఏర్పాటు చేసే ఈ నిధి ద్వారా ఎమ్ఎస్ఎమ్ఈలకు ఊరట ఇస్తుందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన సంస్థలు, భారీ పరిశ్రమలు ఎమ్ఎస్ఎమ్ఈలకు అధిక బకాయి పడ్డాయని, ఈ నిధి ద్వారా ఆ బకాయిలను చెల్లిస్తామని తెలిపారు. మార్కెట్లో నగదు లభ్యత పెరిగేందుకు ప్రభుత్వ వాటా దీన్ని బలపరుస్తుంది. కరోనా వల్ల ఆర్థికవ్యవస్థ నష్టపోతున్నందున ఎమ్ఎస్ఎమ్ఈల మనుగడ ప్రమాదకరంగా మారిన ఈ స్థితిలో కేంద్ర చర్యలు ఉపయోగపడనుంది.

Tags : Nitin Gadkari, MSMEs, coronavirus, covid-19


Next Story

Most Viewed