'అంధాధూన్' రిమేక్‌లో నితిన్

by  |
అంధాధూన్ రిమేక్‌లో నితిన్
X

దిశ, వెబ్ డెస్క్: యంగ్ హీరో నితిన్ చాలాకాలం తర్వాత హిట్ కొట్టాడు. ‘లై’, ‘చల్ మోహనరంగ’, ‘శ్రీనివాస కళ్యాణం’ సినిమాలతో హ్యాట్రిక్ ఫెయిల్యూర్స్ అందుకున్న నితిన్… శుక్రవారం విడుదలైన ‘భీష్మ’ సినిమాతో సూపర్ డూపర్ హిట్ అందుకుని సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. దీంతో నితిన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతుండగా.. మరో హ్యాపీ న్యూస్‌తో వచ్చేశాడు. హిందీలో సూపర్ హిట్ అయిన ‘అంధాధూన్’ సినిమాను రీమేక్ చేస్తున్నట్లు ప్రకటించాడు. ఈ సినిమా షూటింగ్ లాంఛనంగా ప్రారంభించగా మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రేష్ట్ మూవీస్ నిర్మిస్తున్న సినిమా రెగ్యులర్ షూటింగ్ జూన్ నుంచి ఉంటుందని వెల్లడించింది మూవీ యూనిట్.

కాగా ‘అంధాధూన్’ సినిమాకు ఎన్నో అవార్డులు లభించాయి. 2019కిగాను బెస్ట్ హిందీ ఫిల్మ్‌గా నేషనల్ అవార్డు పొందింది. బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లేగా కూడా జాతీయ అవార్డు సొంతం చేసుకున్న ఈ సినిమాలో నటకుగాను బెస్ట్ యాక్టర్‌గా నేషనల్ అవార్డు అందుకున్నారు ఆయుష్మాన్ ఖురానా. అంధుడిగా నటించే వ్యక్తి తన ప్రియురాలి దగ్గర ఎందుకు దోషిగా నిలబడ్డాడు? తన ముందు జరుగుతున్న క్రైమ్స్ చూస్తూ ఆ వ్యక్తి ఎలా స్పందించాడు? క్రిమినల్స్‌ను ఎలా పట్టించాడు? అనేది కథ కాగా… విమర్శల ప్రశంసలు అందుకుంది ఈ చిత్రం.

Read also..

ట్రంప్ టూర్‌‌‌కు వ్యతిరేకంగా మావోలు..

Next Story

Most Viewed