- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TWITTER TRENDING: హర్షవర్దన్ స్థానంలో నిర్మలా?
<p>దిశ, వెబ్‌డెస్క్: కేంద్రమంత్రివర్గ విస్తరణ జరగనున్న క్రమంలో పలు ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇప్పటికే పలువురు కేంద్రమంత్రులకు ప్రధాని మోదీ కేబినెట్ నుంచి ఉద్వాసన కల్పించగా.. వారు తమ పదవులకు రాజీనామా చేశారు. కొత్తగా 43 మందిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. వీరు సాయంత్రం 6 గంటలకు ప్రమాణస్వీకారం చేయనుండగా.. ఆ తర్వాత శాఖలు కేటాయించనున్నారు. ఈ క్రమంలో ఒక వార్త ట్విట్టర్‌లో ట్రెండింగ్‌గా మారింది. హెల్త్ మినిస్టర్ హర్షవర్దన్ రాజీనామా చేయడంతో.. ఈయన స్థానంలో ఆరోగ్యశాఖమంత్రిగా నిర్మలా […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: కేంద్రమంత్రివర్గ విస్తరణ జరగనున్న క్రమంలో పలు ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇప్పటికే పలువురు కేంద్రమంత్రులకు ప్రధాని మోదీ కేబినెట్ నుంచి ఉద్వాసన కల్పించగా.. వారు తమ పదవులకు రాజీనామా చేశారు. కొత్తగా 43 మందిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. వీరు సాయంత్రం 6 గంటలకు ప్రమాణస్వీకారం చేయనుండగా.. ఆ తర్వాత శాఖలు కేటాయించనున్నారు.
ఈ క్రమంలో ఒక వార్త ట్విట్టర్‌లో ట్రెండింగ్‌గా మారింది. హెల్త్ మినిస్టర్ హర్షవర్దన్ రాజీనామా చేయడంతో.. ఈయన స్థానంలో ఆరోగ్యశాఖమంత్రిగా నిర్మలా సీతారామన్‌కు బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం జరుగుతోంది. ఇక కొత్త ఫైనాన్స్ మినిస్టర్‌గా నిర్మలా స్థానంలో ఎవరిని కేటాయిస్తారనే దానిపై సోషల్ మీడియాలో అనేక చర్చలు జరుగుతున్నాయి. Nirmala అనే హ్యాష్‌ట్యాగ్ ప్రస్తుతం ట్విట్టర్‌లో ట్రెండింగ్‌గా మారింది.
Next Story






