పండుగ వేళ ట్రెండింగ్‌లో నిర్మలా సీతారామన్ పోస్టు.. నెటిజన్ల ఫన్నీ కామెంట్స్ (వీడియో)

by  |

దిశ, వెబ్‌డెస్క్ : జనరేషన్ మారిపోయింది.. దేశ ప్రజలంతా డిజిటల్ చెల్లింపులపైనే ఫోకస్ చేస్తున్నారు. ప్రతీ ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉండటంతో Paytm, Phone Pay, Google Payలో డిజిటల్ పేమెంట్స్ పెరిగిపోయాయి. దేశంలో పట్టణ, గ్రామీణ ప్రాంతం అనే తేడా లేకుండా దాదాపు అని షాపుల వద్ద డిజిటల్ పేమెంట్స్ చేసుకునేందుకు వెసులుబాటు ఉంది.

అయితే ఇలా డిజిటల్ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ట్విట్టర్‌లో ఓ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇంతకీ ఆ వీడియోలో ఏముంది అనుకుంటున్నారా.?

తెలుగు రాష్ట్రాల్లో పండుగల సందర్భంగా గంగిరెద్దులను వీధుల్లో తిప్పుతూ కొందరు భిక్షాటన చేస్తుంటారు. ఇది అందరికీ తెలిసిందే. అయితే ఈ వీడియోలో గంగిరెద్దులాడించే వారు ఆ ఎద్దుపై క్యూఆర్‌ కోడ్‌ ట్యాగ్‌ను అమర్చి.. వీధుల్లో భిక్షాటన చేస్తున్నారు. డబ్బులు ఇవ్వాలనుకున్న వారు ఆ కోడ్‌ను స్కాన్ చేసి వారికి మనీ ట్రాన్స్‌ఫర్ చేస్తారు. ఈ వీడియోపై నిర్మల స్పందిస్తూ దేశంలో డిజిటల్ చెల్లింపుల విప్లవం జానపద కళాకారుల వరకూ చేరిందని కొనియాడారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్‌సైట్‌లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.

Next Story

Most Viewed