- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘యెస్ బ్యాంకు పునర్ నిర్మాణం కోసం ప్రణాళిక’
<p>యెస్ బ్యాంకు పునర్ నిర్మాణం కోసం ప్రణాళికను తయారు చేసినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఆర్బీఐ ఇచ్చిన ప్రతిపాదనల ప్రకారం ఆ ఆలోచన చేశామన్నారు. కేంద్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాలపై నిర్మలా సీతారామన్ ఢీల్లీలో శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా నష్టాల్లో ఉన్న యెస్ బ్యాంకుకు బెయిల్ అవుట్ ప్రకటిస్తున్నట్లు ఆమె వివరణ ఇచ్చారు. బ్యాంకులో సుమారు 49 శాతం ఈక్విటీని పెట్టుబడి పెట్టనున్నట్లు స్పష్టం చేశారు. బ్యాంకు మూలధనాన్ని 1100 కోట్ల […]</p>

యెస్ బ్యాంకు పునర్ నిర్మాణం కోసం ప్రణాళికను తయారు చేసినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఆర్బీఐ ఇచ్చిన ప్రతిపాదనల ప్రకారం ఆ ఆలోచన చేశామన్నారు. కేంద్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాలపై నిర్మలా సీతారామన్ ఢీల్లీలో శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా నష్టాల్లో ఉన్న యెస్ బ్యాంకుకు బెయిల్ అవుట్ ప్రకటిస్తున్నట్లు ఆమె వివరణ ఇచ్చారు. బ్యాంకులో సుమారు 49 శాతం ఈక్విటీని పెట్టుబడి పెట్టనున్నట్లు స్పష్టం చేశారు. బ్యాంకు మూలధనాన్ని 1100 కోట్ల నుంచి 6200 కోట్ల వరకు పెంచుతున్నామన్నారు. యెస్ బ్యాంకుపై ఉన్న మారిటోరియంను మరో మూడు రోజుల్లో ఎత్తివేస్తున్నామన్నారు. ఎస్‌బీఐకి చెందిన ఇద్దరు డైరక్టర్లతో ఓ కొత్త బోర్డును ఏర్పాటు చేయనున్నట్లు నిర్మలా సీతారామన్ ఈ సందర్భంగా వెల్లడించారు.
Tags: nirmala seetharaman, plan, yes bank, restructuring






