- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రైతులపై పోలీస్ కేసులు..!
by Chintha Aamani |
<p>దిశ, ఆదిలాబాద్: నిర్మల్ జిల్లాలో ఓ అంశం చర్చనీయాంశం అవుతుంది. ధాన్యం కొనుగోలు చేయాలంటూ ధర్నా, రాస్తారోకో చేసిన రైతులపై పోలీసులు కేసులు పెట్టారు. గత 50 రోజులుగా మక్కలు, 20 రోజులుగా వడ్లు కొనుగోలు చేయడంలో జాప్యాన్ని నిరసిస్తూ 3 రోజుల క్రితం నిర్మల్ భైంసా రోడ్డుపై రైతులు రాస్తారోకో చేశారు. గుండంపల్లి క్రాస్ రోడ్డు వద్ద టెంబుర్ని గ్రామ రైతులు మొక్కజొన్న, వరి ధాన్యం కొనుగోలు చేయాలని రాస్తారోకో చేసిన విషయం తెలిసిందే కాగా […]</p>

X
దిశ, ఆదిలాబాద్: నిర్మల్ జిల్లాలో ఓ అంశం చర్చనీయాంశం అవుతుంది. ధాన్యం కొనుగోలు చేయాలంటూ ధర్నా, రాస్తారోకో చేసిన రైతులపై పోలీసులు కేసులు పెట్టారు. గత 50 రోజులుగా మక్కలు, 20 రోజులుగా వడ్లు కొనుగోలు చేయడంలో జాప్యాన్ని నిరసిస్తూ 3 రోజుల క్రితం నిర్మల్ భైంసా రోడ్డుపై రైతులు రాస్తారోకో చేశారు. గుండంపల్లి క్రాస్ రోడ్డు వద్ద టెంబుర్ని గ్రామ రైతులు మొక్కజొన్న, వరి ధాన్యం కొనుగోలు చేయాలని రాస్తారోకో చేసిన విషయం తెలిసిందే కాగా ఆ రైతులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ పరిణామం రైతుల్లో తీవ్ర ఆగ్రహం నింపుతున్నది. ధాన్యం కొనుగోలు చేయమన్నందుకు మాపై కేసులు పెట్టడమేంటని మండిపడుతున్నారు.
Next Story






