నిఖిల్ '18 పేజీస్‌'లో ఏముంది?

by Shyam |

<p>నిఖిల్ హీరోగా వస్తున్న కొత్త చిత్రం &#8217;18 పేజీస్&#8217;. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్త నిర్మాణంలో తెరకెక్కుతున్న చిత్రానికి &#8216;కుమారి 21F&#8217; ఫేం పల్నాటి సూర్యప్రతాప్ దర్శకులు. అల్లు అరవింద్ సమర్పణలో వస్తున్న ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే సుకుమార్ అందిస్తున్నారు. సినిమా పూజా కార్యక్రమాలు హైదరాబాద్‌లో ఘనంగా జరగ్గా&#8230; &#8217;18 పేజీస్&#8217; టైటిల్‌ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. గోపీ సుందర్ సంగీతం అందిస్తున్న చిత్రం.. నిఖిల్ కెరియర్‌లో ది [&hellip;]</p>

నిఖిల్ 18 పేజీస్‌లో ఏముంది?
X

నిఖిల్ హీరోగా వస్తున్న కొత్త చిత్రం ’18 పేజీస్’. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్త నిర్మాణంలో తెరకెక్కుతున్న చిత్రానికి ‘కుమారి 21F’ ఫేం పల్నాటి సూర్యప్రతాప్ దర్శకులు. అల్లు అరవింద్ సమర్పణలో వస్తున్న ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే సుకుమార్ అందిస్తున్నారు. సినిమా పూజా కార్యక్రమాలు హైదరాబాద్‌లో ఘనంగా జరగ్గా… ’18 పేజీస్’ టైటిల్‌ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. గోపీ సుందర్ సంగీతం అందిస్తున్న చిత్రం.. నిఖిల్ కెరియర్‌లో ది బెస్ట్ అవుతుందంటున్నారు.

‘అర్జున్ సురవరం’ సినిమాతో హిట్ అందుకున్న నిఖిల్.. ‘కార్తికేయ 2’ను పట్టాలెక్కించాడు. చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. కాగా ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ మూవీతో వచ్చేస్తున్నాడు నిఖిల్.

Tags: Nikhil, 18 Pages, Geetha Arts, Sukumar Writings, Sukumar, Bunny Vas, Gopi Sundar

Next Story