- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాంట్రాక్టర్ నిర్లక్ష్యం.. రైలు ఢీకొని నైట్ వాచ్‌మెన్ మృతి
<p>దిశ, ఓదెల : పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని హరిపురం గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామంలో ఉన్న రైల్వే లైన్ 33-E గేటు వద్ద ఆదివారం రాత్రి రైలు ఢీకొని మాటూరి ఎల్లయ్య(55) మృతిచెందాడు. గ్రామస్తుల తెలిపిన వివరాల ప్రకారం.. హరిపురంలోని 33-E గేటు వద్ద అండర్ పాసింగ్ బ్రిడ్జీ నిర్మాణం పనులు జరుగుతున్నాయి. అందులో నైట్ వాచ్ మెన్‌గా పనిచేస్తున్న ఎల్లయ్య ప్రమాదవశాత్తు రైలు ఢీకొని మృతి చెందినట్లు తెలిపారు. రైల్వే కాంట్రాక్టర్ నిర్లక్ష్యం […]</p>

దిశ, ఓదెల : పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని హరిపురం గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామంలో ఉన్న రైల్వే లైన్ 33-E గేటు వద్ద ఆదివారం రాత్రి రైలు ఢీకొని మాటూరి ఎల్లయ్య(55) మృతిచెందాడు. గ్రామస్తుల తెలిపిన వివరాల ప్రకారం.. హరిపురంలోని 33-E గేటు వద్ద అండర్ పాసింగ్ బ్రిడ్జీ నిర్మాణం పనులు జరుగుతున్నాయి. అందులో నైట్ వాచ్ మెన్‌గా పనిచేస్తున్న ఎల్లయ్య ప్రమాదవశాత్తు రైలు ఢీకొని మృతి చెందినట్లు తెలిపారు.
రైల్వే కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లనే ఎల్లయ్య మృతి చెందాడని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. హరిపురం గ్రామంలో ఎల్లయ్య పొద్దంతా సఫాయి పనిచేస్తూ సాయంత్రం నైట్ వాచ్‌మెన్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. దళిత కుటుంబానికి చెందిన మల్లయ్యకు భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. మృతుని కుటుంబాన్ని అండర్ పాసింగ్ బ్రిడ్జీ కాంట్రాక్టర్ ఆదుకోవాలని గ్రామస్తులు ఆందోళనకు దిగారు.
- Tags
- dead
- Karimnagar






