సూపర్‌ స్టార్‌తో నిధి రొమాన్స్

by  |
Nidhi Agarwal
X

దిశ, సినిమా : ఇస్మార్ట్ భామ నిధి అగర్వాల్ స్టార్ రేంజ్ దక్కించుకునేందుకు చాలా కష్టపడుతోంది. తమిళ్‌లో చేసిన రెండు సినిమాలతోనే తనకు గుడి కట్టించేంతగా కోలీవుడ్ అభిమానుల మనసు గెలుచుకున్న భామ.. అక్కడ చాలా బిజీ అయిపోయింది. ఇక టాలీవుడ్ విషయానికి వస్తే గల్లా అశోక్ డెబ్యూ మూవీతో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ చిత్రంలో లీడ్ రోల్స్ చేస్తూ దూసుకుపోతోంది. ఇక బాలీవుడ్‌లోనూ అవకాశాలు క్యూ కడుతున్న తరుణంలో.. టాలీవుడ్ నుంచి నిధికి మరో బంపర్ ఆఫర్ చిక్కినట్లు ఫిల్మ్ నగర్ టాక్. సూపర్ స్టార్ మహేశ్ బాబు – త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో ఈ మధ్య కొత్త ప్రాజెక్ట్ ప్రకటించిన విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్‌లో మూడో సినిమా కాగా.. ప్రాజెక్ట్‌పై అంచనాలు భారీగానే ఉన్నాయి. కాగా ఈ సినిమాలో అందాల నిధికి అవకాశం దక్కినట్లు సమాచారం. ఇదే నిజమైతే అటు పవర్ స్టార్.. ఇటు సూపర్ స్టార్‌తో స్క్రీన్ రొమాన్స్ చేయబోతున్న నిధి, ఈ రెండు సినిమాలు సక్సెస్ అయితే కచ్చితంగా స్టార్ హీరోయిన్‌గా మారిపోతుందని చెప్తున్నారు విశ్లేషకులు.



Next Story

Most Viewed