పవన్‌తో సినిమా.. నిధికి స్టార్ రేంజ్!

by  |
పవన్‌తో సినిమా.. నిధికి స్టార్ రేంజ్!
X

దిశ, వెబ్‌డెస్క్: ఇస్మార్ట్ భామ నిధి అగర్వాల్ స్టార్ హీరోయిన్ కాబోతుందా? చాలా జాగ్రత్తగా సినిమాలు సెలెక్ట్ చేసుకుంటూ కెరియర్ గ్రాఫ్ పెంచుకుంటున్న ఈ భామ.. టాలీవుడ్‌లో ప్రస్తుతమున్న స్టార్ హీరోయిన్స్‌కు చెక్ పెట్టనుందా? గ్లామరస్ టచ్ ఇచ్చేందుకు ఏ మాత్రం వెనకాడని ఈ స్మార్ట్ హీరోయిన్.. ఈ మధ్య కేవలం కంటెంట్ ఉన్న పాత్రలు, అది కూడా స్టార్ హీరోల సినిమాలైతేనే ఓకే చేయడం చూస్తుంటే నిజమే అనిపిస్తోంది.

అటు కోలీవుడ్ అయినా ఇటు టాలీవుడ్ అయినా సరే.. కథ నచ్చకపోతే ఏ మాత్రం సంకోచించకుండా నో చెప్పేస్తుంది నిధి. కేవలం స్టార్ హీరోల ప్రాజెక్ట్‌లు మాత్రమే ఓకే చేస్తోంది. ఈ క్రమంలోనే తమిళ్‌లో శింబు ఈశ్వరన్ ప్రాజెక్ట్‌లో నటిస్తున్న నిధి.. తెలుగులో ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పక్కన చాన్స్ కొట్టేసినట్టు సమాచారం. ఇది అన్ అఫిషియల్ అయినా సరే, ట్విట్టర్‌ ట్రెండింగ్‌లో ఉండగా.. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రాబోతుందని టాక్. క్రిష్, పవన్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమాలో ముందుగా బాలీవుడ్ భామ జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ను అనుకున్నా.. తర్వాత అందాల నిధికే ఆ అవకాశం దక్కిందని తెలుస్తోంది. తన ట్విట్టర్ ఎకౌంట్‌లోనూ నిధి ఈ సినిమా గురించి పోస్ట్ చేయడంతో ఆల్మోస్ట్ కన్‌ఫర్మ్ అయిందనే చెప్పొచ్చు. ఒకవేళ ఇదే నిజమై.. నిధి కూడా ఇప్పటిలా కేవలం స్టార్ హీరోలకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇస్తే కెరియర్ ఓ రేంజ్‌లో దూసుకుపోతుంది అనడంలో సందేహం లేదంటున్నారు విశ్లేషకులు. అన్నట్లు నిధి తనకున్న డిమాండ్ చూసి రెమ్యునరేషన్ కూడా పెంచేసినట్లు టాక్.

Next Story

Most Viewed