దీపావళి అసలు అర్థం చెప్పిన హీరోయిన్

by  |
దీపావళి అసలు అర్థం చెప్పిన హీరోయిన్
X

దిశ, సినిమా : అందాల నిధి అగర్వాల్ బిజీ షెడ్యూల్స్ నుంచి బ్రేక్ తీసుకుంది. దీపావళిని గ్రాండ్‌గా జరుపుకుని.. బెస్ట్ మెమొరీస్‌ను పెంచుకునే క్రమంలో ఒక్కరోజు షూటింగ్‌లకు హాజరు కాలేకపోతున్నట్లు తెలిపింది. ప్రస్తుతం తెలుగు, తమిళ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్న ఈ భామ.. పండుగ కోసం బెంగళూరులోని తన ఇంటికి వెళ్లింది. పర్‌ఫెక్ట్ దివాళీ అంటే టేస్టీ అండ్ డెలిషియస్ ఫుడ్, లైటింగ్ దియాస్, న్యూ మెమరీస్ అని తెలిపింది.

అంతేకాకుండా కుటుంబంతో కలిసి ప్రత్యేక పూజా కార్యక్రమాల్లోనూ పాల్గొననుంది. అంతేకాదు ఈ సారి పండగకు అమ్మ స్పెషల్ డ్రెస్ డిజైన్ చేయించిందని చెప్పింది. ప్రస్తుతం చేస్తున్న రెండు తెలుగు సినిమాల్లో ఒకటి పాన్ ఇండియా ప్రాజెక్ట్ కాగా అది నెక్స్ట్ ఇయర్ రిలీజ్ కానున్నట్లు తెలిపిన నిధి.. మరో టాలీవుడ్ ప్రాజెక్ట్, ఒక కోలీవుడ్ మూవీ షూటింగ్‌కు కూడా హాజరవుతున్నట్లు తెలిపింది.

Next Story

Most Viewed