- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కెనడియన్ హీరోకు కరోనా… పరిస్థితి విషమం
<p>కరోనా మహమ్మారి కారణంగా ఎంతో మంది చనిపోతుంటే… మరెంతో మంది బాధపడుతున్నారు. ప్రముఖులు కూడా కరోనా నుంచి తప్పించుకునే అవకాశం లేదు. ఈ క్రమంలోనే హాలీవుడ్ లో చాలా మంది సెలబ్రిటీలు కరోనా పాజిటివ్ తో హాస్పిటల్ లో చేరారు. కొందరు ఈ వ్యాధి నుంచి కోలుకుంటే మరి కొందరు మృత్యువాత పడ్డారు. ఈ క్రమంలో ప్రముఖ కెనడియన్ హీరో నిక్ కార్డెరో కు కరోనా పాజిటివ్ రావడంతో లాస్ ఏంజిల్స్ లోని హాస్పిటల్ లో చేరాడు. […]</p>

కరోనా మహమ్మారి కారణంగా ఎంతో మంది చనిపోతుంటే… మరెంతో మంది బాధపడుతున్నారు. ప్రముఖులు కూడా కరోనా నుంచి తప్పించుకునే అవకాశం లేదు. ఈ క్రమంలోనే హాలీవుడ్ లో చాలా మంది సెలబ్రిటీలు కరోనా పాజిటివ్ తో హాస్పిటల్ లో చేరారు. కొందరు ఈ వ్యాధి నుంచి కోలుకుంటే మరి కొందరు మృత్యువాత పడ్డారు.
ఈ క్రమంలో ప్రముఖ కెనడియన్ హీరో నిక్ కార్డెరో కు కరోనా పాజిటివ్ రావడంతో లాస్ ఏంజిల్స్ లోని హాస్పిటల్ లో చేరాడు. అయితే కరోనా ఇన్ఫెక్షన్ తో కుడి కాలు లోని రక్తనాళాలు గడ్డకట్టాయి. దీంతో కాలు తొలగించాల్సి వచ్చిందట. ఊపిరితిత్తులకు కూడా ఇన్ఫెక్షన్ సోకినట్లు తెలిసింది. ప్రస్తుతం కరోనాతో పోరాడుతున్న నిక్ పరిస్థితి నిలకడగా ఉన్నట్లు భార్య అమండా క్లూట్స్ సోషల్ మీడియా ద్వారా తెలిపింది. ప్రస్తుతం నిక్ ప్రాణాలకు ప్రమాదం లేదని వైద్యులు చెప్పినట్లు వెల్లడించింది.
Tags: Canadian Actor, Hollywood, Nick Cordero, Amanda kloots






