డబుల్‌ సెంచరీతో దుమ్మురేపిన ‘కేన్ మామ’

by  |
డబుల్‌ సెంచరీతో దుమ్మురేపిన ‘కేన్ మామ’
X

దిశ, వెబ్‌డెస్క్: న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ పాకిస్తాన్‌కు చుక్కలు చూపిస్తున్నాడు. వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో డబుల్ సెంచరీ సాధించిన విలియమ్సన్‌.. తాజాగా పాకిస్తాన్‌తో సెంచూరియన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో విలియమ్సన్ డబుల్ సెంచరీతో చెలరేగాడు. మూడో రోజు ఆటలో ఓవర్‌నైట్ వ్యక్తిగత స్కోరు 112తో బ్యాటింగ్‌ని కొనసాగించిన విలియమ్సన్ 364 బంతుల్లో 28 ఫోర్లతో 238 పరుగులు చేశారు. అంతేగాకుండా తన టెస్టు కెరీర్‌లో నాలుగో డబుల్ సెంచరీని నమోదు చేశాడు. మ్యాచ్‌లో విలియమ్సన్‌తో పాటు హెన్రీ నికోలస్(157), డార్లీ మిచెల్ (102) సెంచరీలు బాదడంతో న్యూజిలాండ్ ఇవాళ తొలి ఇన్నింగ్స్‌ని 659/6తో డిక్లేర్ చేసింది.

Next Story

Most Viewed