కుర్రకారు కొత్త క్రష్.. ఆనా బెన్

by  |
కుర్రకారు కొత్త క్రష్.. ఆనా బెన్
X

బేసికల్‌గా.. మలయాళీ హీరోయిన్లంటే కుర్రకారులో ఏదో తెలియని క్రష్ పుడుతుంది. కేరళ కుట్టీల క్రేజ్ అలా ఉంటుంది మరి! పర్ఫార్మెన్స్‌లోనూ వారు ఇరగదీస్తారనుకోండి, అది వేరే విషయం. గతంలో ‘ప్రేమమ్’ మలయాళం సినిమాతో అనుపమ పరమేశ్వరన్‌కు ఎంత క్రేజ్ వచ్చిందో అందరికీ తెలిసిందే. ‘అల్లం బెల్లం అనుపమ నా పెళ్లాం..’ అంటూ కామెంట్లు, కొటేషన్లు కూడా పుట్టుకొచ్చాయి. ఇప్పుడు అదే రేంజ్‌లో మరో కేరళ కుట్టి మీద కూడా కుర్రకారు పిచ్చి ప్రేమను ఒలకబోస్తున్నారు. ఇప్పటి వరకు చేసింది మూడు సినిమాలే అయినా.. అందం, అభినయంతో ఈ మలయాళీ ముద్దుగుమ్మ అందర్నీ కట్టిపడేస్తోంది. శంఖాల్లాంటి కళ్లు, పొగమంచులా తేలియాడే రింగుల జుట్టు ఉన్న ఈ భామ పేరు ఆనా బెన్.

జూన్ 22న నెట్‌ఫ్లిక్స్‌లో ‘ఆనా’ నటించిన ‘కప్పెలా’ సినిమా విడుదలైంది. అది చూసిన వాళ్లందరూ వెంటనే ఆమె గురించి గూగుల్‌లో వెతికారు. ఆనా నటించిన ‘కుంబాలంగి నైట్స్, హెలెన్’ సినిమాలను కూడా వదలకుండా చూసేశారు. ఇక ఆమె నటనకు ఫిదా అయిపోయి మార్కెట్లోకి కొత్త క్రష్ వచ్చేసిందిరో అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేస్తున్నారు. ఇక్కడ బాగా నాటుకుపోయిన అంశం ఏంటంటే.. ఆనా ఎంచుకున్న సినిమాల కథలు. మూడు సినిమాలు మూడు విభిన్న కొత్తరకపు కథాంశాలతో తెరకెక్కించినవి. దీంతో ఆ మూడు సినిమాలను అందరూ తప్పకుండా చూడాలని రికమెండ్ చేస్తున్నారు. కుంబాలంగీ నైట్స్ సినిమా విషయం పక్కన బెడితే హెలెన్, కప్పెలా సినిమాల్లో కథ మొత్తం ఆమె చుట్టే తిరుగుతుంది.

హెలెన్ సినిమాలో హోటల్ ఫ్రీజర్‌లో అనుకోకుండా ఇరుక్కుపోయినపుడు ఆమె పడే సంఘర్షణను ఆనా ముఖంలోని హావభావాలు చూసి వీక్షకులు మెచ్చుకోకుండా ఉండలేరు. ఇక ‘కప్పెలా’ సినిమాలో అమాయకపు విలేజ్ గర్ల్‌గా ఫోన్‌లో అపరిచిత వ్యక్తితో మాట్లాడుతూ రొమాంటిక్ సంబంధాన్ని పెంచుకుని, ఆ తర్వాత భయంకరమైన పరిస్థితుల్లో పడిన జెస్సీగా తన అభినయాన్ని చూసి అందరూ ఫిదా అవుతున్నారు. హెలెన్ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో ఉంది. ఇక ఆలస్యమెందుకు.. సినిమాలు చూసేసి, ఆ పాప అభినయానికి మీరు కూడా మార్కులు వేసేయండి.

Next Story