అఫ్ఘాన్‌లో సరికొత్త అధ్యాయం మొదలు- చైనా వ్యాఖ్య

by  |
China President Jinping
X

దిశ వెబ్‌డెస్క్: అప్ఘానిస్తాన్ నుంచి యూఎస్ బలగాల ఉపసంహరణతో ఆ దేశంలో సరికొత్త అధ్యాయం మొదలైందని చైనా పేర్కోంది. యూఎస్ చర్యలను ఎప్పుడు విమర్శించే చైనా తాలిబన్లతో స్నేహపూర్వక, సహకార సంబంధాలను కొనసాగించేందుకు సిద్ధమని పేర్కొంది. ‘అప్ఘానిస్తాన్ విదేశీ సైనికుల అక్రమణనుంచి ఇప్పుడు విముక్తి పొందింది. అఫ్ఘాన్ పౌరులు తమ దేశంలో శాంతి, పునర్మిణానాన్ని కొత్తగా మొదలుపెడుతున్నారు’ అని చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ వెన్‌బిన్ పేర్కొన్నారు. కాబుల్‌లో ఉన్న చైనా విదేశాంగ కార్యాలయం తమ సేవలను కొనసాగిస్తుందని, భద్రతా కారణాలతో బీజింగ్ కూడా చైనా ప్రజల తరలింపును కొన్ని నెలల కిందే చేసిందని పేర్కొన్నారు.

తాలిబన్లను అధికార ప్రభుత్వంగా బీజింగ్ ఇంకా గుర్తించలేదని, వారు మద్ధతిస్తున్న ముస్లిం-మైనారీటీ ఉయ్‌గర్ వేర్పాటువాదులను సున్నిత సరిహద్దు ప్రాంతమైన జిన్జియాంగ్‌లోకి ప్రవేశించాలని ప్రయత్నిసున్నారని వెల్లడించారు. అప్ఘానిస్తాన్‌లో సమ్మిళిత, విస్తృత ప్రభుత్వం ఏర్పడి, అన్ని రకాల ఉగ్రవాద కార్యకలాపాలను అణచి‌వేస్తుందని ఆశిస్తున్నట్లు వాంగ్ పేర్కొన్నారు. బీజింగ్, కాబుల్‌లో స్థిరమైన, సహకార పరిపాలనతో పాటు విదేశీ మౌలిక సదుపాయాల డ్రైవ్ విస్తరణ కోసం చూస్తుందని నిపుణులు స్పష్టం చేశారు. గత నెలలో ఉన్నత‌స్థాయి తాలిబన్ అధికారులు వాంగ్‌తో సమావేశం నిర్వహించారు. అప్ఘానిస్తాన్ ఎటువంటి ఉగ్రవాద సంస్థలకు కేంద్రంగా ఉండదని తెలిపారు. సుదీర్ఘ యుద్ధం తర్వాత సోమవారం పూర్తిగా అప్ఘాన్‌ను విడిచిన బలగాలు అమెరికా వెళ్లాయి. దీంతో తాలిబన్లు తుపాకులు పేల్చి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు



Next Story