ఎవరెస్టు ఎత్తు 8848 మీటర్లు కాదంటా!

by  |
ఎవరెస్టు ఎత్తు 8848 మీటర్లు కాదంటా!
X

ఖాట్మాండు: ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన శిఖరం ఎవరెస్టు ఎత్తు 8,848.86 మీటర్లుగా మంగళవారం చెన్నై, నేపాల్ దేశాలు సంయుక్తంగా ప్రకటించాయి. ఎవరెస్టు ఎత్తును 1954లో మొదటిసారి సర్వే ఆఫ్ ఇండియా లెక్కించింది. సర్వే ఆఫ్ ఇండియా ప్రకారం 8,848 మీటర్లు. నేపాల్‌, చైనా దేశాలు సంయుక్త చేపట్టిన లెక్కింపులో ఎవరెస్టు 8,848.86 మీటర్లుగా తేలినట్టు పేర్కొన్నాయి. ఇది గతంలో కంటే 0.86 మీటర్లు లేదా 86 సెంటీమీటర్లు ఎక్కువ కావడం గమనార్హం.

2015లో భూకంపం, ఇతర కారణాలతో ఎవరెస్టు ఎత్తు మారిందని పెద్ద ఎత్తున చర్చ సాగుతున్నది. ఈ క్రమంలో కచ్చితమైన ఎత్తును నిర్ధారించడం కోసం మళ్లీ ఎవరెస్టు ఎత్తును కొలవాలని నేపాల్ ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త లెక్కల ప్రకారం ఎవరెస్టు శిఖరం ఎత్తు 8,848.86 మీటర్లుగా నేపాల్ విదేశాంగ మంత్రి ప్రదీప్ గ్యావాలీ ప్రకటించారు.

గతంలో చైనా ప్రభుత్వం చేపట్టిన లెక్కింపు ప్రకారం ఎవరెస్టు ఎత్తు 8844.43 మీటర్లు. 1954లో సర్వే ఆఫ్ ఇండియా నిర్ధారించిన దాని కంటే 4 మీటర్లు తక్కువ కావడం గమనార్హం. శాస్త్రీయ పరిశోధనతోపాటు స్కేల్ ఆధారంగా మొత్తం ఆరుసార్లు ఎవరెస్టు శిఖరం ఎత్తును చైనా సర్వేయర్లు లెక్కించారు. 1975 లెక్కల ప్రకారం 8,848.13 కాగా, 2005 లెక్కల ప్రకారం 8,844.43 మీటర్లుగా ప్రకటించారు.

ఎవరెస్టు పర్వతాలను టిబెటెన్ భాషలో కొమోలంగ్మా. 1961లో చైనా, నేపాల్ దేశాలు సరిహద్దు సమస్యలను పరిష్కరించుకున్నాయి. ఇరుదేశాల సరిహద్దు రేఖ ఎవరెస్టు శిఖరం నుంచి వెళ్తుంది. ఇండియా ప్లేట్, యురోపియన్ ప్లేట్ల అంచుల మధ్యలో ఎవరెస్టు శిఖరం ఉంటుంది. ఈ ప్లేట్ల కదలిక చాలా చురుకుగా ఉంటుంది.

Next Story

Most Viewed