షాట్ ఓకే .. షూటింగ్స్ షురూ

by  |
షాట్ ఓకే .. షూటింగ్స్ షురూ
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ బాద్ షా.. షారుఖ్ ఖాన్ దాదాపు రెండేళ్ల తర్వాత సెట్స్ మీదకు వెళ్లాడు. 2018లో ‘జీరో’ సినిమాలో చివరగా కనిపించిన షారుఖ్.. దాదాపు 20 స్క్రిప్ట్‌లు పరిశీలించాక ‘పఠాన్’ ఫైనల్ చేశారు. యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ పై ఆదిత్య చోప్రా నిర్మిస్తున్న ఈ సినిమాకు సిద్ధార్థ్ ఆనంద్ దర్శకులు. ముంబైలోని యశ్ రాజ్ స్టూడియోస్‌లో షూటింగ్ జరుగుతుండగా.. మూవీ యూనిట్ చాలా హ్యాపీగా ఉంది. జాన్ అబ్రహం, దీపికా పదుకునే మెయిన్ రోల్స్ చేస్తుండగా..2021లో షూటింగ్‌లో షారుఖ్‌ జాయిన్ కానున్నారు.

రామోజీఫిల్మ్ సిటీలో ‘అన్నాత్తె’:
సూపర్ స్టార్ రజినీకాంత్ అన్నాత్తె సినిమా షూటింగ్ మళ్లీ ప్రారంభమైంది. హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన స్పెషల్ సెట్స్‌లో దాదాపు నెలరోజుల పాటు షూటింగ్ జరగనుండగా.. ఈ షెడ్యూల్‌తో సినిమా చిత్రీకరణ పూర్తి కానుంది. ఇప్పటికే జరిగిన షూటింగ్ సీన్స్ ఎడిటింగ్ కంప్లీట్ అయిందని సమాచారం. శివ దర్శకత్వంలో వస్తున్న సినిమాను కళానిధి మారన్ నిర్మిస్తుండగా..కీర్తి సురేశ్, మీనా, నయనతార, ఖుష్బూ సుందర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

‘సర్కస్’ స్టార్ట్:
బాలీవుడ్ మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ రోహిత్ శెట్టి లేటెస్ట్ మూవీ ‘సర్కస్’ షూటింగ్ స్టార్ట్ అయింది. రణ్‌వీర్‌సింగ్ హీరోగా జాక్వెలిన్ ఫెర్నాండేజ్, పూజా హెగ్డే హీరోయిన్లుగా చేస్తున్న సినిమా చిత్రీకరణ మెహబూబ్ స్టూడియోస్‌లో ప్రారంభమైంది. ప్రస్తుతం బూత్ పోలీస్ షూటింగ్‌లో బిజీగా ఉన్న జాక్వెలిన్ మినహా.. మిగతా కాస్ట్ అంతా కూడా షూటింగ్‌లో జాయిన్ అయిందట. ది కామెడీ ఆఫ్ ఎర్రర్స్ నవల ఆధారంగా తెరకెక్కిన అంగూర్ సినిమాకు రిమేక్‌గా వస్తున్న సర్కస్‌ను వచ్చే ఏడాది శీతాకాలంలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసింది మూవీ యూనిట్.

విక్కీ టర్న్:
యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ 50 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రకటించిన బిగ్గెస్ట్ ప్రాజెక్ట్స్‌లో విక్కీ కౌశల్, మానుషి చిల్లర్ స్టారింగ్ మూవీ కూడా ఒకటి. కామెడీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం అయింది. స్క్రిప్ట్ చేతిలో పట్టుకుని అద్దం ముందు కూర్చున్న పిక్ ఫొటో షేర్ చేసిన విక్కీ.. శుభారంభం అంటూ ట్యాగ్ లైన్ యాడ్ చేస్తూ అప్‌డేట్ ఇచ్చాడు. కాగా, యశ్‌రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌లో వస్తున్న విక్కీ ఫస్ట్ ప్రాజెక్ట్ ఇదే కావడం విశేషం.

‘గాలి సంపత్’ బిగిన్స్:
శ్రీ విష్ణు, రాజేంద్ర ప్రసాద్ తండ్రీ కొడుకులుగా నటిస్తున్న చిత్రం ‘గాలి సంపత్’. అనిష్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాను ఎస్.క్రిష్ణ నిర్మిస్తుండగా..షూటింగ్ ప్రారంభమైంది. ఈ చిత్రానికి డైరెక్టర్ అనిల్ రావిపూడి స్క్రీన్ ప్లే, క్రియేటివ్ సపోర్ట్ అందిస్తున్నారు.

Next Story

Most Viewed