హీరోయిన్స్‌ను భయపెడుతున్న అల్లు అర్జున్ వైఫ్ స్నేహ..

by  |
allu-sneha
X

దిశ, వెబ్‌డెస్క్ : ఫిటినెస్ కోసం, స్లిమ్‌గా ఉండేందుకు ఎంతో మంది హీరోయిన్స్ యోగా చేయడం, ఆసనాలు వేయడం, ఫుడ్ విషయంలో ఎంతో శ్రద్ధ తీసుకోవడం వంటివి మనం చూసే ఉంటాం. అయితే, స్టార్ హీరో భార్య సైతం ఫిట్‌నెస్ కోసం అలాంటి ఆసనాలు వేస్తూ హీరోయిన్స్‌కు పోటీ ఇస్తోందా.? హీరోయిన్లను భయపెడుతోందా.?. ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ కామెంట్స్ వస్తున్నాయి. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.? స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ భార్య స్నేహారెడ్డి. అయితే, స్నేహారెడ్డి ఇన్‌స్టాగ్రమ్‌ని ఫాలో అయ్యేవారు మాత్రం ఇది నిజమే అని ఖచ్చితంగా చెబుతారు.

స్నేహారెడ్డి తన ఇన్‌స్టాగ్రమ్‌లో షేర్‌ చేసిన పిక్‌ చూసిన ఎవరైనా సరే.. వావ్‌ అనాల్సిందే. ఈ పిక్‌లో ఆమె వేసిన యోగాసనం చూసిన ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తూ.. కామెంట్స్‌ చేస్తున్నారు. తల కిందకు పెట్టి గాలిలో వేలాడుతున్న ఈ ఆసనం.. స్నేహారెడ్డిని సోషల్‌ మీడియాలో మరింతగా పాపులర్‌ చేస్తోంది. ఎందుకంటే అలాంటి విన్యాసాలతో స్నేహారెడ్డి అందరికీ షాక్‌ ఇస్తోంది. ఈ సందర్భంలో బన్నీకి తగ్గ భార్య అంటూ, హీరోయిన్లను భయపెట్టేస్తోందిగా.. అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.

Next Story