- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేతాజీ తమ్ముడి కూతురు కన్నుమూత
by Shamantha N |
<p>కోల్‌కతా: నేతాజీ సుభాశ్ చంద్రబోస్ తమ్ముడు శరత్ చంద్రబోస్ కూతురు, ప్రముఖ విద్యావేత్త చిత్ర ఘోష్(90) హృద్రోగ సమస్యలతో కన్నుమూశారు. శరత్ చంద్రబోస్ చిన్న కూతురు ఘోష్ గురువారం ఉదయం 10.30 గంటలకు తుదిశ్వాస విడిచినట్టు ఆమె బంధువు, బీజేపీ నేత చంద్ర కుమార్ బోస్ వెల్లడించారు. ప్రజలకు సేవ చేయడానికి, యువతకు స్ఫూర్తినివ్వడానికి ఆమె తన జీవితాన్ని కేటాయించారని పేర్కొన్నారు. ఆమె మరణానికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీలు సంతాపం తెలిపారు. మహిళా […]</p>

X
కోల్‌కతా: నేతాజీ సుభాశ్ చంద్రబోస్ తమ్ముడు శరత్ చంద్రబోస్ కూతురు, ప్రముఖ విద్యావేత్త చిత్ర ఘోష్(90) హృద్రోగ సమస్యలతో కన్నుమూశారు. శరత్ చంద్రబోస్ చిన్న కూతురు ఘోష్ గురువారం ఉదయం 10.30 గంటలకు తుదిశ్వాస విడిచినట్టు ఆమె బంధువు, బీజేపీ నేత చంద్ర కుమార్ బోస్ వెల్లడించారు. ప్రజలకు సేవ చేయడానికి, యువతకు స్ఫూర్తినివ్వడానికి ఆమె తన జీవితాన్ని కేటాయించారని పేర్కొన్నారు.
ఆమె మరణానికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీలు సంతాపం తెలిపారు. మహిళా సాధికారతకు, మానవ హక్కుల కోసం అవిరామంగా కృషి చేశారని, ఆమె మరణం బాధాకరమని రాష్ట్రపతి ట్వీట్ చేశారు. ఆమె కుటుంబానికి సానుభూతి ప్రకటించారు. విద్యారంగం, సమాజానికి ఆమె సేవలు చిరస్మరణీయమని, ఆమె మరణం కలచివేసిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
Next Story






