31శాతం క్షీణించిన ప్రత్యక్ష పన్ను వసూళ్లు..!

by  |
31శాతం క్షీణించిన ప్రత్యక్ష పన్ను వసూళ్లు..!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఏప్రిల్-ఆగష్టు మధ్య నికర ప్రత్యక్ష పన్ను (Net direct tax) వసూళ్లు 31 శాతం క్షీణించి రూ. 1,92,718 కోట్లకు తగ్గాయి. కాగా, నికర పరోక్ష పన్ను వసూళ్లు (Net indirect Tax) 11శాతం క్షీణించి రూ. 3,42,591 కోట్లుగా నమోదైనట్టు కేంద్ర ఆర్థిక సహాయమంత్రి అనురాగ్ సింగ్ ఠాగుర్ (Anurag singh thakur) లోక్‌సభలో వెల్లడించారు. 2018-19 ఆర్థిక సంవత్సరానికి ఏప్రిల్-ఆగష్టు నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ. 2,79,711 కోట్లుగా నమోదవ్వగా, నికర పరోక్ష పన్ను వసూళ్లు రూ. 3,85,499 కోట్లుగా ఉన్నాయని తెలిపారు. అలాగే, ప్రస్తుత ఏడాది ఏప్రిల్-ఆగష్టు మధ్య జీఎస్టీ (GST) వసూళ్లు రూ. 1.81 లక్షల కోట్లుగా నమోదయ్యాయి.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed