మీ రాముడు కాదు.. మా రాముడు

by  |
మీ రాముడు కాదు.. మా రాముడు
X

దిశ,వెబ్‌డెస్క్: మీ ఇండియాలోనే కాదు మా నేపాల్‌లో కూడా శ్రీరాముడి కోసం ఆలయ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయంటూ నేపాల్ ఆపద్ధర్మ ప్రధాని కేపీ శర్మ ఓలీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే ఆయన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన నేపాల్ అధికారపార్టీ నేషనల్కమ్యూనిస్ట్పా ర్టీ నుంచి బహిష్కరించింది. ప్రస్తుతం ఆయన ఆపద్ధర్మ పీఎంగానే కొనసాగుతున్నారు. అయితే ఈ నేపథ్యంలో పార్టీ ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మరోసారి తన నోటికి పనిచెప్పారు. శ్రీరాముడు పుట్టిన అయోధ్య భారత్ లో కాదు నేపాల్ లోని బీర్‌సంగ్ ప్రాంతంలో ఉంది. ఆయన కోసం ఆలయం నిర్మించేందుకు భారత్ లో ఏర్పాట్లు జరుగుతున్నాయి.కానీ నేపాల్లో ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి.వచ్చే ఏడాది శ్రీరామనవమి నాటికి దేశంలోని అయోధ్యపురిలో విగ్రహ ప్రతిష్ఠాపన జరుగుతుందన్నారు. ఈ ప్రాంతాన్ని గొప్ప పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని నేపాల్ ఆపద్ధర్మ ప్రధాని కేపీ శర్మ ఓలీ స్పష్టం చేశారు.



Next Story

Most Viewed