నర్స్ తో డాక్టర్ రాసలీలలు.. పదేళ్లు వాడుకొని వదిలేసాడంటూ నడిరోడ్డుపై రచ్చ(వీడియో)..

by  |
నర్స్ తో డాక్టర్ రాసలీలలు.. పదేళ్లు వాడుకొని వదిలేసాడంటూ నడిరోడ్డుపై రచ్చ(వీడియో)..
X

దిశ, వెబ్‌డెస్క్: వివాహేతర సంబంధాలు రోజురోజుకు ఎక్కువైపోతున్నాయి. వాటివలన ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి.. వేరొక మహిళ/పురుషుడిపై మోజు వారి జీవితాలను రోడ్డుకీడుస్తున్నాయి. తాజాగా ఒక నర్స్ తో వివాహేతర సంబంధం పెట్టుకొని ఆమెను పెళ్లి చేసుకొని ఇప్పుడు వదిలించుకోవడానికి ప్రయతిస్తున్న ఓ డాక్టర్ బాగోతం బట్టబయలయ్యింది. తనను ఎందుకు మోసం చేసావ్ అని మాట్లాడినందుకు నడిరోడ్డుపైనే ఆమెపై దాడికి దిగిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ దారుణ ఘటన నెల్లూరు జిల్లాలో వెలుగుచూసింది.

వివరాలలోకి వెళితే.. నెల్లూరు నగరానికి చెందిన బాలకోటేశ్వరరావు అనే వ్యక్తి హోమియోపతి డాక్టర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. అతని దగ్గరే బోడిగాడితోటకు చెందిన ఓ మహిళ నర్స్ గా పనిచేస్తోంది. డాక్టర్ కి ఇంతకుముందే పెళ్లి అయ్యి పిల్లలు ఉన్నా అతని చూపు ఎప్పుడు మహిళలపైనే ఉండేది. ఈ నేపథ్యంలోనే మహిళా నర్స్ పై కన్నేసిన డాక్టర్ తనకు పెళ్లి కాలేదని చెప్పి దగ్గరయ్యాడు. డాక్టర్ మాయమాటలు నమ్మిన మహిళ అతనికి దగ్గరయింది. ఆ తరువాత ఆమెను పెళ్లిచేసుకొని కాపురం పెట్టాడు. కొంతకాలం బాగానే నడిచిన వీరి వివాహేతర సంబంధంలో కలతలు చెలరేగాయి. డాక్టర్ కి ఇదివరకే పెళ్లి జరిగిందని తెలుసుకున్న నర్స్ అగ్గిమీద గుగ్గిలం అయ్యింది.

ఇక ఇటీవల బాలకోటేశ్వరరావు ఆమెను దూరం పెట్టడమే కాకుండా వేరే మహిళతో కూడా సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న నర్స్ అతనిని నిలదీసింది. దీంతో డాక్టర్ రెచ్చిపోయాడు. అడగడానికి నువ్వెవరు అంటూ ఆమెను రోడ్దుపైనే ఇష్టం వచ్చినట్లు తిట్టాడు. వారిద్దరి మధ్య వాగ్వాదం తారాస్థాయికి చేరుకొని ఒకరిపై ఒకరు దాడి చేసుకునేవరకు వెళ్లింది. కోపంతో చెలరేగిన మహిళ కోటేశ్వరరావును చొక్కాపట్టుకొని రోడ్డుపైకి లాకొచ్చి నిలదీసింది. దీంతో అతను విచక్షణ మరిచి ఆమెను నడిరోడ్డుపైనే చెప్పుతో కొట్టాడు. ఆమె కూడా అతడిపై దాడికి పాల్పడింది. కాగా.. రోడ్డుపై ఇద్దరూ కొట్టుకున్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అనంతరం సదరు మహిళ జిల్లా ఎస్పీ వద్దకు వెళ్లి ఫిర్యాదు చేసింది. తనకు తాళికట్టి వదిలేసాడని, తనపై హత్యాయత్నానికి కూడా ప్రయత్నించాడని ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.



Next Story

Most Viewed