నెల బిడ్డను ఇంట్లో వదిలేసిన హీరోయిన్.. ఆ తర్వాత జరిగింది తెలిస్తే..

by  |
నెల బిడ్డను ఇంట్లో వదిలేసిన హీరోయిన్.. ఆ తర్వాత జరిగింది తెలిస్తే..
X

దిశ, సినిమా : బాలీవుడ్ లేడీ నేహా ధూపియా ఫస్ట్ బేబీ పుట్టిన తర్వాత జరిగిన ఇన్సిడెంట్‌ను వివరించింది. తహీరా కశ్యప్ రచించిన ‘సెవెన్ సిన్స్ ఆఫ్ బీయింగ్ మామ్’ పుస్తకంపై ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్ షోలో డిస్కస్ చేసిన నేహా.. తనను అప్రిషియేట్ చేసింది. ఈ క్రమంలోనే ఓసారి ఇంట్లోనే బిడ్డను మరిచిపోయి బయటకు వెళ్లిన విషయాన్ని గుర్తుచేసుకుంది. బిడ్డ పుట్టిన 40 రోజుల వరకు ఇంటికే పరిమితం కావడంతో భర్త అంగద్ బేడీతో కలిసి ముంబై సీ లింక్‌లో డ్రైవింగ్ వెళ్లాలనుకున్నా. ఈ ఎగ్జైట్‌మెంట్‌లో పాపను ఇంట్లోనే వదిలేసి డ్రైవింగ్‌కు వెళ్లాను. బయటకెళ్లిన 45 నిమిషాల్లోనే బేబీ ఏడుస్తుందని నర్స్ నుంచి కాల్ వచ్చింది. అయితే ఆ విషయం నీకెలా తెలుసని ఆమెను ప్రశ్నిస్తే అసలు విషయం తెలిసింది. అప్పుడు కారు వెనుక సీటులో చూస్తే పాప లేకపోవడంతో బేబీని తమతో తీసుకురాలేదనే విషయం అర్థమైంది’ అని చెప్పింది.


Next Story

Most Viewed