- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ రోడ్డును చూసి ప్రయాణికులు షాక్.. ఇలా కూడా మరమ్మతు చేస్తారా!
<p>దిశ, లోకేశ్వరం: బీటీ రోడ్డు పై పడిన గుంతలకు డాంబరుతో, సీసీ రోడ్డు పై పడిన గుంతలకు సిమెంట్‌తో ప్యాచ్‌లు వేయడం చూశాం. కానీ, బీటీ రోడ్డుకు మొరంతో ప్యాచ్‌లు వేయడం తొలిసారిగా చూస్తున్నాం. వింటుంటే విడ్డూరంగా ఉంది కానీ అర్లి ఎక్స్ రోడ్డు నుండి లోకేశ్వరం వరకు చేపట్టిన పనులను చూస్తే బీటీ రోడ్డుకు మరమ్మతు పనులు ఈ విధంగా కూడా చేయవచ్చా అని ఆ రోడ్డు పై వెళ్తున్న వాహనదారులు ఆశ్చర్యపోతున్నారు. వివరాల్లోకి వెళితే.. […]</p>

దిశ, లోకేశ్వరం: బీటీ రోడ్డు పై పడిన గుంతలకు డాంబరుతో, సీసీ రోడ్డు పై పడిన గుంతలకు సిమెంట్‌తో ప్యాచ్‌లు వేయడం చూశాం. కానీ, బీటీ రోడ్డుకు మొరంతో ప్యాచ్‌లు వేయడం తొలిసారిగా చూస్తున్నాం. వింటుంటే విడ్డూరంగా ఉంది కానీ అర్లి ఎక్స్ రోడ్డు నుండి లోకేశ్వరం వరకు చేపట్టిన పనులను చూస్తే బీటీ రోడ్డుకు మరమ్మతు పనులు ఈ విధంగా కూడా చేయవచ్చా అని ఆ రోడ్డు పై వెళ్తున్న వాహనదారులు ఆశ్చర్యపోతున్నారు. వివరాల్లోకి వెళితే.. నర్సాపూర్ (జి )మండలంలోని అర్లీ ఎక్స్ రోడ్డు నుండి లోకేశ్వరం మండల కేంద్రం వరకు గల బీటీ రోడ్డుకు మోకాలు లోతు గుంతలు పడ్డాయి. ఆ గుంతలు పూడ్చి మరమ్మతులు చేపట్టడానికి రూపాయలు ఆరు లక్షలు రోడ్లు భవనాల శాఖ మంజూరు చేసింది. అంత వరకు బాగానే ఉన్నా, గత రెండు రోజుల నుండి మరమ్మతు పనులు చేపట్టిన కాంట్రాక్టర్ డాంబర్ తో కాకుండా గుంతల లోపల కంకర వేసి పైన మొరంతో మరమ్మతులు చేపట్టారు. కానీ వాటి పై రోడ్డు రోలరు తిప్పకుండా అలాగే వదిలేస్తున్నారు. దీంతో మరమ్మతు పనుల మన్నిక పై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఆరు లక్షల తో అతుకులు మున్నాళ్ల ముచ్చట కానున్న పనులు ..
దీంతో రూపాయలు 6 లక్షల ప్రజాధనం వృధా కానుందని ఆరోపణలు వస్తున్నాయి . మొరంతో మరమ్మతులు చేపట్టడం వల్ల ఈ పనులు మున్నాళ్ళ ముచ్చట కానున్నాయి అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అదే ఆరు లక్షలతో డాంబర్‌తో మరమ్మత్తులు చేపడితే కనీసం హవర్గా గ్రామం వరకు అయినా కొన్నాళ్ళపాటు సమస్య పరిష్కారం కాదని మండల వాసులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
వాహనదారుల ఇబ్బందులు చూసి తాత్కాలిక మరమ్మతులు చేయిస్తున్నాం..
గత కొంత కాలంగా రోడ్ల మరమ్మతులకు ప్రభుత్వం నుండి నిధులు మంజూరు కావడం లేదు. అర్లీ ఎక్స్ రోడ్డు నుండి లోకేశ్వరం వరకు రోడ్డు గుంతల మయం కావడంతో ప్రజాప్రతినిధుల ఒత్తిడి మేరకు రూ 6 లక్షల వ్యయంతో తాత్కాలిక మరమ్మతులు చేపట్టాం. పెద్ద గుంతలకు అడుగుభాగంలో వైట్ మిక్స్ వేసి పైన మొరం వేయాలని సూచించాం. అలాగే చిన్న గుంతలకు డాంబర్ తో ప్యాచ్ లు వేయాలని కాంట్రాక్టర్ ను ఆదేశించాం. బైంసా మండలంలోని పార్డి (బి), మహా గాం రోడ్లకు కూడా మరమ్మతులు ఈ విధంగానే చేయించాం. మన్నిక గానే ఉన్నాయి.
(రోడ్లు భవనాల శాఖ డి ఈ రవీందర్ రెడ్డి)






