ఆటో పరిశ్రమపై ‘కిమ్’ ఏమన్నారంటే ?

by  |
photo
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఆటో పరిశ్రమలో సవాళ్లను తగ్గించేందుకు ప్రత్యామ్నాయంగా స్థానిక సరఫరా వ్యవస్థను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని హ్యూండాయ్ మోటార్ ఇండియా ఎండీ, సీఈఓ ఎస్ఎస్ కిమ్ అన్నారు. గురువారం ఆటోమోటివ్ కాంపొనెంట్ మాన్యూఫాక్చరర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఏసీఎంఏ) వార్షిక సమావేశంలో మాట్లాడిన ఆయన.. దేశీయంగా స్థానిక ఉత్పత్తిని పెంచేందుకు, పరిశ్రమలో సరఫరాను మెరుగుపరిచేందుకు మౌలిక సదుపాయాల ఏర్పాటుపై గట్టిగా దృష్టి సారించాలని కిమ్ స్పష్టం చేశారు. ఈ విధానం ద్వారా భారత్‌లో మొత్తం పరిశ్రమకు, ఎగుమతుల కార్యకలాపాలకు అధిక స్థాయిలో సామర్థ్యాన్ని, స్థిరత్వాన్ని ఇస్తుందన్నారు.

దీనికోసం ప్రభుత్వం జోక్యం, మద్దతు కావాలని, తద్వారా భారత్‌ను మెరుగైన ఉత్పతి కేంద్రంగా మార్చగలమని కిమ్ వివరించారు. దేశీయంగా పట్టణ జనాభా పెరుగుతూనే ఉంది. దీంతో వ్యక్తిగతంగా, వ్యాపార పరంగా వృద్ధి కనబడుతోందన్నారు. భవిష్యత్తులో ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని హ్యూండాయ్ సంస్థ మొబిలిటీ, ఎలక్ట్రిక్, కనెక్ట్, సొంత టెక్నాలజీ విభాగాల్లో పటిష్టమయ్యే ప్రణాళికను సిద్ధం చేస్తున్నామని కిమ్ తెలిపారు. మొబిలిటీ రంగంలో అధునాతన, వినూత్నమైన ఫీచర్లు అందించడంతో దృష్టి పెడతామని ఆయన వివరించారు. అలాగే, సరసరమిన ధరల్లో జీరో-ఎమిషన్ వాహనాలను తీసుకురావడమపై శ్రద్ధ వహించనున్నట్టు పేర్కొన్నారు.


Next Story

Most Viewed