శరద్ పవార్‌కు సర్జరీ సక్సెస్

by Shamantha N |

<p>ముంబయి: ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌కు సర్జరీ పూర్తయిందని, విజయవంతంగా పిత్తాశయంలో నుంచి స్టోన్‌ను తొలగించారని మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ తోపె వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నదని వివరించారు. రెండు రోజుల క్రితం శరద్ పవార్ పొత్తి కడుపులో నొప్పితో ముంబయిలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్‌లో చేరిన సంగతి తెలిసిందే. ఈ హాస్పిటల్‌లో కొన్ని పరీక్షలు చేయగా, పిత్తాశయంలో సమస్య ఉన్నదని, ఆపరేషన్ చేసి రాయి తొలగించాలని వైద్యుల బృందం నిర్దారణకు [&hellip;]</p>

శరద్ పవార్‌కు సర్జరీ సక్సెస్
X

ముంబయి: ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌కు సర్జరీ పూర్తయిందని, విజయవంతంగా పిత్తాశయంలో నుంచి స్టోన్‌ను తొలగించారని మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ తోపె వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నదని వివరించారు. రెండు రోజుల క్రితం శరద్ పవార్ పొత్తి కడుపులో నొప్పితో ముంబయిలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్‌లో చేరిన సంగతి తెలిసిందే. ఈ హాస్పిటల్‌లో కొన్ని పరీక్షలు చేయగా, పిత్తాశయంలో సమస్య ఉన్నదని, ఆపరేషన్ చేసి రాయి తొలగించాలని వైద్యుల బృందం నిర్దారణకు వచ్చిందని డాక్టర్ అమిత్ మయదేవ్ వివరించారు.

Next Story