- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- కెరీర్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- టెక్నాలజీ
- స్పోర్ట్స్
- సాహిత్యం
- జిల్లా వార్తలు
- భక్తి
- ఫోటోలు
- వీడియోలు
- ఆరోగ్యం
- రాశిఫలాలు
దిశ, వెబ్‌డెస్క్: సౌత్ ఇండియాలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్లలో నయనతార పేరు టాప్‌లో ఉంటుంది. యాక్షన్, రొమాంటిక్, లేడీ ఓరియెంటెడ్ ఇలా ప్రతి పాత్రలోనూ అమ్మడు ప్రేక్షకులను మెప్పించింది. కథ, పాత్ర ఏదైనా నయనతార అద్భుతంగా నటిస్తుందని ప్రేక్షకులు అంటారు. ప్రస్తుతం అమ్మడు తాను నెగిటివ్ రోల్‌లో కనిపించనున్న ‘కతువాకుల రెండు కాదల్’ సినిమా చిత్రీకరణలో బిజీగా ఉంది. ఈ సినిమాను నయనతార ప్రియుడు విఘ్నేశ్ శివన్ డైరెక్ట్ చేస్తున్నాడు. వీరిద్దరు వచ్చే ఏడాది పెళ్లి పీటలెక్కనున్నారని కూడా టాక్ వినిపిస్తోంది.
అయితే నయనతార కొత్తగా మరో వ్యాపారం ప్రారంభించింది. పేరు పొందిన డెర్మటాలజిస్ట్ డాక్టర్ రేణిత రాజన్‌త కలిసి నయన్ ఈ బిజినెస్ ప్రారంభించింది. అదే ‘లిప్ బామ్’ కంపెనీ. ‘ప్రతి పెదవులకు సరిపోయే లిప్ బామ్ ఉంటుంది. మీకు సరైన దాన్ని www.thelipbalmco.in లో పొందండి. సరికొత్త, టాప్ రేటెడ్ లిప్‌బామ్స్‌కూడా లభిస్తాయి’ అంటూ టీమ్ ఓ ప్రకటన చేశాయి. అంతేకాకుండా ఈ లిప్‌బమ్స్ ప్రపంచంలోని నాణ్యమైన ముడి పదార్థాలను ఉపయోగించి, పెదవులకు అన్ని విధాల పనిచేసే లిప్‌బామ్ తయారు చేయబడిందని వారు తెలిపారు.
అయితే అమ్మడు ఈ ఏడాది ప్రారంభంలో తన ప్రియుడు విఘ్నేశ్‌తో కలిసి చెన్నై ప్రధాన కార్యాలయంగా ‘చాయ్ వాలే’ అనే బ్రాండ్‌ను స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. దీంతో అమ్మడు బిజినెస్‌లో జోరు చూపించడంతో అభిమానుల్లో కొత్త సందేహాలు రేకెత్తుతున్నాయి. పెళ్లైన తరువాత సినిమాలకు దూరంగా ఉండేందుకే నయన్ ఈ బిజినెస్ ప్లాన్స్ చేస్తుందా అని వారు సందేహిస్తున్నారు. మరి దీనిపై నయనతార ఏమైనా క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.
కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్సైట్లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.