నయన్‌ను ఎంచుకున్న ‘ప్రేమమ్’ డైరెక్టర్

by  |
నయన్‌ను ఎంచుకున్న ‘ప్రేమమ్’ డైరెక్టర్
X

దిశ, వెబ్‌డెస్క్: ‘ప్రేమమ్’ డైరెక్టర్ ఆల్ఫోన్స్ పుట్రెన్.. తన మూడో సినిమా అప్‌డేట్ ఇచ్చారు. సెప్టెంబర్‌లోనే ‘పట్టు’ టైటిల్ అనౌన్స్ చేసిన ఆయన.. ఇందులో హీరోగా ఫాహద్ ఫజిల్ నటించబోతున్నట్లు తెలిపారు. ఇందులో హీరోయిన్‌గా లేడీ సూపర్ స్టార్ నయనతారను ఎంచుకున్నట్లు తాజాగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అంతేకాదు ఈ సారి మ్యూజిక్ కూడా తనే అందించబోతున్నట్లు తెలిపారు. త్వరలోనే కాస్ట్ అండ్ క్రూ గురించి మరింత సమాచారం అందిస్తానని చెప్పారు.

బేసికల్లీ మ్యూజిక్ డైరెక్టర్ అయిన ఆల్ఫోన్స్ 2013లో నజ్రియా నజీమ్ – నివిన్ పాలీ కాంబినేషన్‌లో వచ్చిన ‘నేరం’ మూవీతో డైరెక్టర్‌గా మారారు. ఆ తర్వాత మళ్లీ నివిన్ పాలీ హీరోగా సాయి పల్లవి, అనుపమ పరమేశ్వరన్, మడోనా సెబాస్టియన్ హీరోయిన్లుగా ‘ప్రేమమ్‌’ సినిమా తెరకెక్కించి ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు. ‘ప్రేమమ్’ ఆయన కెరియర్‌లో గేమ్ చేంజర్ కాగా.. ప్రస్తుతం ముచ్చటగా మూడో సినిమా చేస్తున్నారు ఆల్ఫోన్స్. ఈ క్రమంలోనే ప్రేక్షకులను మెప్పించేందుకు సూపర్ కంటెంట్‌ను ఎంచుకున్నట్లు తెలిపారు.

Next Story

Most Viewed